07-02-2024
---------------
న్యూ ఢిల్లీ..
సుప్రీంకోర్టు.
మందకృష్ణ మాదిగ - కేకే వేణుగోపాల్.
93 ఏండ్ల వయసులో మందకృష్ణన్న పిలుపుకు స్పందించి జాతి పక్షాన వాదించిన భారతదేశ మాజీ అటార్నీ జనరల్, 60 ఏండ్ల సుదీర్ఘ అనుభవం కల్గిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, విధి రత్న అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ కేకే వేణుగోపాల్ గారు.
రెండవ రోజు జరుగుతున్న విచారణలో MRPS తరుపున న్యాయవాదిగా ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ *"కేకే వేణుగోపాల్"* గారు ఏడుగురూ జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు బలంగా వాదనలు వినిపించారు.
కేకే వేణుగోపాల్ దేశంలో పేరొందిన ప్రముఖ న్యాయవాది మాత్రమే కాదు భూటాన్ రాజ్యాంగం యొక్క ముసాయిదా రూపకల్పనకు రాజ్యాంగ సలహాదారుగా పనిచేశారు. శ్రీలంకలోని తమిళ ప్రాంతాలపై అధికారాల వికేంద్రీకరణపై న్యాయ సలహా ఇచ్చాడు. స్పెక్ట్రమ్, బాబ్లీ పలు అనేక కీలకమైన కేసుల్లో వాదించిన, సుదీర్ఘమైన అనుభవం కల్గిన వ్యక్తి కేకే వేణుగోపాల్ గారు
న్యాయం కోసం 93 ఏండ్ల వయసులో దగాపడ్డ జాతి గుండె చప్పుడును వినిపించిన మీకు యావత్తు జాతి పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం.!
- రాగల్ల ఉపేందర్ మాదిగ
MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
తెలంగాణ రాష్ట్రం.
(ఇది ఒక వాట్సాప్ గ్రూపులో వచ్చిన నివేదిక వార్త. మొదటి పేరా చూడండి...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి