"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

26 జనవరి, 2024

ఆగస్టు 15, జనవరి 26 జెండా ఎగురవేయడంలో తేడా ఏమిటి?


August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..? ఖచ్చితంగా అన్ని తెలిసిన మేధావులం.. తెలిసి తప్పు చేయొద్దు తెలవకపోతే తెలుసుకొని సరిదిద్దుదాం..మరచిపోవద్దు

ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 

ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. 

ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.

 అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. 

ఆ తేడా ఏమిటో  తెలుసుకుందాము👇

👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.

 ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.

మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. 

👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.  

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*. 

ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.

 ( గమనిక:  ఇక్కడ  జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).

దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. .

గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.

 స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.

అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. 

దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. 

అయితే ఇక్కడ గమనించాల్సిన  వ్యత్యాసం ఏమిటంటే..

👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు.(Flag Hoisting).

👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను  ఆవిష్కరిస్తారు(Flag Unfurling) .

ఇంకొక వ్యత్యాసం  ఏమిటంటే .. 

స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. 

(వాట్సాప్ నుండి సేకరణ)

👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం *ఎర్రకోటలో* జరుగుతుంది.

👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26  నాడు *రాజ్‌పథ్‌లో* జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).

            

కామెంట్‌లు లేవు: