దార్ల గారూ,మీ నెమలీకల బాల్యాన్ని చదివి,మా నెమలి రేకుల చిన్నప్పటి జ్ఞాపకాలను గురుతు చేసుకున్నాను. అందరి బాల్యాలు ఒక్కటే,ఎవ్వరి బాల్యమూ మరొకరితో పోల్చేది కాదు ఎవరి బాల్యం వాళ్లకు ఎంత గొప్పదో, ఆ బాల్యం లోని బాధలన్నీ ఇప్పుడు మధుర స్మృతులే, ఒక్కోసారి కన్నీళ్లు పెట్టించి, మరొక్కసారి జలదరించి, మరొక్కసారి పులకించిపోయే మీ జ్ఞాపకాల,పసితనపు అనుభవాలను మేము కూడా అనుభవించినట్టు గా రాసిన మీ జ్ఞాపకాల పొత్తం ఒక సజీవమైన మీ బాల్యం ....బాగుంది అని పొడిగా చెప్పే మాటల కన్నా విలువైనది మీ బాల్యం.
ఇప్పుడే మీ పుస్తకాన్ని పూర్తి చూసి, వెంటనే నా అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను. కృతజ్ఞతలు దార్లగారూ...
Prof.N.Rajani, Department of Telugu, Dr.B.R.Ambedkar Open University
02.10.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి