"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

15 అక్టోబర్, 2023

ఆచార్య రాచపాళెం వారి 75 వ జన్మదినోత్సవ వేడుకలు (14.10.2023)

 ప్రగతిశీల సాహిత్య విమర్శకుడు రాచపాళెం

అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ




















అధ్యయనం, అవగాహన, స్పష్టమైన సామాజిక దృక్పథం గల ప్రగతిశీల విమర్శకుడు రాచపాళెం చంద్ర శేఖర్రెడ్డి అని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రశంసించారు. రాచపాళెం కేవలం రాయలసీమ సాహిత్యానికే కాకుండా తెలుగు సాహిత్య విమర్శకు కేంద్రంగా నిలిచారని పేర్కొన్నారు. అభ్యుదయ ప్రగతిశీల సాహిత్య మార్గంలో ఐదున్నర దశాబ్దాలు నిరంతరం రచనలు చేస్తూ వస్తున్నారని తెలిపారు. అనంతపురం ప్రభుత్వ కళాశాలలోని డ్రామా హాలులో శనివారం సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు, కవి, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి పుస్తకాలు మన నవలలు (సాహిత్య విమర్శ), మన కథానికలు (సాహిత్య విమర్శ)తో పాటు విమర్శాపునర్నవం ప్రత్యేక సాహిత్య సంచిక |ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లా డుతూ, తెలుగు సాహిత్య విమర్శకు సంబంధించి రాయలసీమ నుంచి అనేక మంది గొప్పవారు వచ్చారనీ, వారి స్ఫూర్తి కొనసాగింపుగా రాచపాళెం ఉన్నారని చెప్పారు. మార్క్సిస్టు దృక్పదంతో రచనలు చేస్తున్న గొప్ప వ్యక్తి రాచపాళెం అన్నారు. సైన్స్, సాహిత్యం సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని బలంగా నమ్మే వ్యక్తని చెప్పారు. మూడున్నర దశాబ్దాలుగా అరసం, అభ్యుదయ సాహిత్యంలో గొప్ప కృషిచేస్తున్న అభ్యుదయ సాహితీవేత్తనీ, అభ్యుదయ సాహిత్య విమర్శను కొనసాగించడంలో స్వయంగా ఆయన పాలుపంచుకోవడమేకాకుండా తన శిష్యులు, తెలిసిన వారిని ప్రభావితం చేస్తున్న వ్యక్తి రాచపాళెం అని పెనుగొండ కొనియాడారు.


విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ 'మన నవలలు' సాహిత్య విమర్శను జూలూరు ఆవిష్కరించారు. తెలుగు సాహిత్యంలో కొడవటిగంటి కుటుంబరావు, కేవీ రమణారెడ్డి, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచమల్లు రామచంద్రారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి వంటి విమర్శకులు తెలుగు సాహిత్యాన్ని. శక్తిమంతం చేసేందుకు సానబట్టారని చెప్పారు. రాచపాళెం పేరున జరుగుతున్న ఈ సభ విమర్శకు పునరుజ్జీవన వేదికగా నిలుస్తుందని, తెలుగు సాహిత్య విమర్శ మంచి రూపం తీసుకుంటుందన్నారు. రాచపాళెం 'గురజాడ తొలి కొత్త కథలపై విమర్శ చేశారని, కవిత్వంపై మంచి విమర్శ రాశారని, రాయలసీమ వాంబుల సంస్కృతిపై మంచి కవిత్వం రాశారని, రాచపాళెం సాహిత్య విమర్యా కేంద్రంగా నిలవటంలో ఆయన 50 ఏళ్ల సుదీర్ఘ సాహిత్య కృషి ఉందనీ తెలిపారు. నిరంతర అధ్యయనం, ఆలోచనలతో రాచపాళెం మాదిరిగా విమర్శలు రాసేవారు రావాలని, విమర్శ రంగంలో వందల మంది రాచపాళెలల అవసరం ఉందన్నారు. విమర్శకునికి రాచపాళెంలాగా ఎక్స్ రే తీసే కళ్లు ఉండాలని, సాహిత్య విమర్య ఎంత బాగుంటే తెలుగు సాహిత్యానికి అంత పురోగతి ఉంటుందని చెప్పారు. సాహిత్య విమర్శను బోధించడమే కాదు, తరగతి బయట ఎదురయ్యే సవాళ్లకు దీటుగా జవాబిచ్చే వ్యక్తిత్వాన్ని వాళ్లకు " అందిస్తూ, సామాజిక ఉద్యమాలకు పునాదులయ్యే విలువలను, సాహిత్యసామగ్రిని విద్యార్థులకు అందజేసిన గురువు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి అని అన్నారు.


దాసరి ఆదినారాయణ ఉద్దీపనాగీతంతో సభా కార్యక్రమం ప్రారంభమైంది. ఇచార్య రాచపాళెం 50 ఏళ్ల - సాహిత్య జీవితతృషి 'విమర్శ పునర్నవం' ప్రత్యేక సంచికను ముఖ్యఅతిథి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపాధ్య క్షులు ఆచార్య మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. రాచపాళెం సాహిత్య కృషిపై 'విమర్శపునర్నవం' ప్రత్యేక సంచికను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్యులు కొలకలూరి మధుజ్యోతి పరిచయం చేశారు. విమర్శ పునర్సవం ప్రధాన సంపాదకుడు డా. కె. నాగేశ్వరా చారి నివేదికను సమర్పించారు. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత బండి నారాయణస్వామి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. యస్. రఘు, సెంట్రల్ : యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు, సుప్రసిద్ధ సాహిత్య సామాజిక విశ్లేషకులు తెలకపల్లి రవి, వై. గోపిరెడ్డి, డా. గేయానంద్, డా. ఎస్ఆర్ దివాకర్ రెడ్డి తదితరులు ప్రసం గించారు. 'మన నవలలు' సాహిత్య విమర్శను వరంగల్ : తెలుగు అధ్యాపకుడు డా. వి.సంపత్ రెడ్డి పరిచయం: చేశారు. ఈ పుస్తకాన్ని కె. చెంచురెడ్డి దంపతులకు అంకిత మిచ్చారు, మన కథానికలు సాహిత్య విమర్శను వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీత డా. శాంతినారాయణ ఆవిష్కరించారు. తెలుగు అధ్యాపకుడు డా. బావి కాటి రాఘ వేంద్ర పరిచయం చేశారు. ఈ పుస్తకాన్ని మదనమోహన రెడ్డి దంపతులకు అంకితమిచ్చారు. మధ్యాహ్నం 'వర్తమాన.. తెలుగు సాహిత్య విమర్శ-వివిధ ధోరణులు' అంశంపై సదస్సు జరిగింది. అనంతపురం అరసం జిల్లా అధ్యక్షుడు. బి. ఈశ్వర్ రెడ్డి ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీక్షణం సంపాదకుడు ఎన్. వేణుగోపాల్ ప్రధాన ప్రసంగంతో ఈ చర్చా సదస్సు ఆసక్తికరంగా జరిగింది. తొలుత ప్రజా గాయ కుడు దాసరి ఆదినారాయణ అలపించిన ఉద్దీపన గీతం అందరినీ ఆకట్టుకుంది. డాక్టర్ జూటూరు షరీఫ్ వందన సమర్పణ చేసిన ఈ సాహితీ కార్యక్రమంలో డాక్టర్ అనంత మాలతి, కటకం కృష్ణవేణి, మధుర శ్రీ, తోట నాగరాజు, గుంటి మురళీకృష్ణ, పండిట్ రియాజుద్దీన్ అహ్మద్, చెట్ల ఈరన్న రామలింగమయ్య తదితరులు పాల్గొన్నారు,

కామెంట్‌లు లేవు: