రెండు శతాబ్దాల క్రితమే రాడికల్ ఫెమినిస్ట్ గురజాడ
ఆంధ్రప్రభ దినపత్రిక, 23.9.2023 సౌజన్యంతో
ప్రజాప్రశ్న దినపత్రిక, 23.9.2023 సౌజన్యంతో
శుభతెలంగాణ దినపత్రిక, 23.9.2023 సౌజన్యంతో
మన తెలంగాణ దినపత్రిక 23.9.2023 సౌజన్యంతో
ఆంధ్రజ్యోతి దినపత్రిక, 23.9.2023 సౌజన్యంతో
జనప్రతిధ్వని దినపత్రిక, 23.9.2023 సౌజన్యంతో
గురజాడను, ఆయన సాహిత్యాన్ని స్మరించుకోవడమంటే గతాన్నీ, వర్తమానాన్నీ, భవిష్యత్తునీ చర్చించుకోవడమేనని అది గురజాడలోని దార్శనికతకు నిదర్శనమని హెచ్ సి యు సోషియాలజీ ప్రొఫెసర్ గుండెమెడ నాగరాజు వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న మహాకవి గురజాడ అప్పారావు జీవితం రచనలు జాతీయ సదస్సులో భాగంగా రెండవరోజు శుక్రవారం ఉదయం అంతర్జాల సదస్సు ప్రారంభ సభలో ఆచార్య గుండెమెడ నాగరాజు కీలకోపన్యాసం చేశారు. గురజాడ అప్పారావు రెండు శతాబ్దాల క్రితమే రాడికల్ ఫెమినిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేశారని ఆచార్య నాగరాజు వ్యాఖ్యానించారు. గురజాడ చిత్రించిన కన్యక పాత్ర ఆత్మ స్వీయ రక్షణలో భాగంగానే చూడాలని, ఆ నాడు రాజరిక నియంతృత్వ ధోరణిని తిరుగుబాటు చేసే సామాన్య స్త్రీకి ప్రతీక ఆయన అన్నారు. గురజాడ ముని మనవలు గురజాడ రవీంద్రుడు
ఆచార్య గుండెమెడ నాగరాజు
శ్రీపురం యజ్ఞశేఖర్
ఆచార్య జె.వి.రమణ
శ్రీమతి గురజాడ అరుణ, గురజాడ వారి మనవరాలు
తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఇతర అధ్యాపకులు
గురజాడ అప్పారావు గారు మా ముత్తాత కావడం మా జీవితంలో ఒక అదృష్టమని ఆ వంశంలో పుట్టినందుకు తాము ఎంతో గర్వపడుతున్నామని ముఖ్య అతిథిగా పాల్గొన్న గురజాడ ముని మనవరాలు,గురజాడ ఫౌండేషన్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు గురజాడ అరుణ అన్నారు. నేడు ఆయన జీవితం, ఆయన రచనలు ప్రజలు సొత్తు అని ఆమె వ్యాఖ్యానించారు.
అసమ్మతి పత్రం చాలావిలువైనదని గురజాడ అప్పారావు భావించేవారని ఆయన మునిమనవడు గురజాడ రవీంద్రుడు చెప్పారు. రెండు రోజులుగా జరుగుతున్న గురజాడ అప్పారావు జీవితం రచనలపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా గురజాడ రవీంద్రుడు పాల్గొని మాట్లాడారు. గురజాడ
విశిష్ట అతిథిగా ఆచార్య ఎన్.ఈశ్వర్ రెడ్డి, గౌరవ అతిథులుగా ఆచార్య జె.వి.రమణ, ఆచార్య శ్రీపురం యజ్ఞశఏఖర్ పాల్గొన్నారు. ఈ
ప్రారంభ సభకు ఆచార్య ఎం.గోనానాయక్, ముగింపు సభకు ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షత వహించారు. మధ్యలో వివిధ సమావేశాలకు ఆచార్య డి.విజయలక్ష్మి, డా.భూక్య తిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి అధ్యక్షులు సుమారు ముప్పై పత్రాలు సమర్పించారు.
ముగింపు సదస్సులో కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు, భాషాశాఖ డైరెక్టర్ ఆచార్య ఎం.రామనాథంనాయుడు సమాపనోత్సవ ప్రసంగం చేశారు. విశిష్ట అతిథిగా గురజాడ ఫౌండేషన్ ఇండియా కార్యదర్శి పి.గోవిందరావు, గౌరవ అతిథులుగా ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు డా.ఖాసీం పఠాన్ ఖాన్, డా.సుంకరగోపాల్ పాల్గొన్నారు. ఈ రెండు రోజులు సదస్సులో గురజాడ జీవితం, సాహిత్యం, భావజాలం, భాషాదృక్పథం, గేయాలు, కన్యాశుల్కం నాటకం తదితర అంశాలపై డా.చిల్లర భవానీ దేవి, రామరాజు విశాలాక్షి, డా.శైలమ్మ, డా. స్వర్ణలత, డా.వైరాగ్యం ప్రభాకర్, మొగిలిచెండు సురేష్ తదితరులు సుమారు నలభై ఐదు పత్రాలను సమర్పించారు. ఈ నివేదికను సదస్సు సహ సంచాలకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు నివేదించారు. ఈ సదస్సులో డా.సంగీతరావు, డా.అనంత శంకర్, డా.రాగ్యా నాయక్, మధుసూదన్ దయాకర్, వనజ, ఈర్ల కమలాకర్ , తుళ్లూరు రవి, నవీన్, ప్రసూన, భూక్య కాశీరామ్ తదితరులు పాల్గొన్నారు.

.jpg)

.jpg)
















1 కామెంట్:
అద్భుతమైన వర్క్ సార్ మీకు అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి