“గురజాడ జీవితం, సాహిత్యం” మీద జరిగిన సదస్సులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాద పూర్వక అభినందనలు. నేను మొదటగా ఇలాంటి సదస్సు నిర్వహించాలని ఆలోచన చేసినప్పుడు, ఆచార్య దార్ల గారిని సంప్రదించి, ఆయన ఆమోదించిన తరవాత సదస్సు స్వరూప, స్వభావాల రూప కల్పనలో పాల్గొని, ఈ సదస్సుకి ఒక మంచి ఆకారాన్ని ఇచ్చే క్రమంలో నేను క్రియాశీలక పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉంది. వృత్తి రీత్యా నేను కాన్సర్ పరిశోధనా సైంటిస్టుని అయినా, జన్మ సంస్కారం వల్ల సాహిత్య పిపాసిని, కవిని, రచయితని. అందుకు మా అమ్మకి సదా ఋణ పడి ఉన్నాను.
సదస్సులో నేను చెప్పిన ముఖ్య విషయాలు –
మన సాహిత్యాన్ని, సంస్కృతిని నిలబెడుతున్న వారిని గౌరవిద్దాం. వారి కుటుంబాలని సత్కరిద్దాం.
గురజాడ మీద, ఆయన సాహిత్యం మీద వచ్చిన వ్యాసాలను భద్రపరచి భావి తరాలకు అందిద్దాము. ఈ ప్రయత్నం లో అందరూ పాలుపంచుకోమని కోరుతున్నాను.
మాటలకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజ పునర్నిర్మాణ కార్యక్రమంలో యువతని భాగ స్వాములను చేసే పనిలో మాతో పాలుపంచుకోండి.
స్వంత లాభం కొంత మానుకుని, పొరుగు వారికి తోడు పడవోయ్
ధన్యవాదాలు
ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ M.Sc., M.Phil., Ph.D.
ప్రధాన సంపాదకులు, ప్రకాశిక
editor@prakasika.org
www.prakasika.org
.....
దార్ల గారి వంటి గురజాడ వారాసుల అవసరం ఎంతైనా ఉంది. ఎంతో శ్రమించి నిర్వహించినందుకు దార్ల గారికి కృతజ్ఞతలు. ఆయన కనబరచిన passion అనుసరణీయము. ధన్యవాదాలు, సోదరా...
ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ.
....
నేను
ఆచార్య సి నారాయణరెడ్డి గారన్నట్టు
" కొండలా కావ్యములు ?
బండలా పద్యములు ?
కావు " అంటూ కలకండ గీతులనల్లిన మహనీయుడు "గురజాడ" వారి " గురు " జాడలను దర్శింపజేసిన అతిముఖ్యమైన సెమినార్ ను అత్యంత సమర్థంగా నిర్వహించిన మిత్రులు ఆచార్య దార్లవారికీ , సహకరిచిన కేంద్రీయ విశ్వ విద్యాలయ ఆచార్య పి రాములు గారికి , ఆచార్య గోనానాయక్ గారికీ , ఇతర పెద్దలకీ , మూలాలు మరువకుండా తెలుగును ప్రేమించే మిత్రులు కొవ్వలి గోపాలకృష్ణ గారికీ , గురజాడ వారసులుగా గురజాడవారి మార్గంలోనే ప్రస్థానం సాగిస్తున్న శ్రీమతి అరుణ గారికీ , రవీంద్రుడు గారికీ ,
వివిధ కోణాల్లో మహాకవి అక్షర సంపదను పంచిపెట్టిన ఆత్మీయ పత్రసమర్పకులందరికీ పేరుపేరునా హార్దికాభినందనలు ...
ప్రతిష్ఠాత్మకమైన సదస్సు నిర్వహణకు వేదికగా నిలిచివెలిగిన కేంద్రీయ విశ్వవిద్యాలయ బాధ్యులందరికీ శుభాభినందనలు...
-గన్నమరాజు గిరిజామనోహరబాబు , హైదరాబాద్
.....
అద్బుతమైన సదస్సులు జరిపి మహా కవిని మనసారా స్మరించిన మీకు హృదయపూర్వక అభినందనలు .ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
దామరాజు విశాలాక్షి,.
కెనడా
.....
గురజాడ రచనలపై సదస్సు నిర్వహించుకోవడానికి మంచి అవకాశం కల్పించిన కొవ్వలి గోపాలకృష్ణగారికి ముందుగా అభినందనలు, ధన్యవాదాలు.
ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించినా, ఆర్థిక వనరులు పరిపుష్టంగా లేని కారణాన నిర్వహించడం కష్టమవుతుంది... ఈ కా
ర్యక్రమం గూర్చి దార్లవారితో ప్రస్తావించగానే మా అధ్యాపక వర్గం మొత్తం సంపూర్ణంగా అంగీకరించి గురజాడ మహాకవి పై సమగ్రమైన చర్చ జరగడానికి మా వంతు కృషి చేశాం. మా విశ్వవిద్యాలయ ఉపకులపతి ,మానవీయ శాస్త్రాల విభాగం డీన్, పలువురు ఆచార్యులు, సీనియర్ ఆచార్యులైన అయినవోలు ఉషాదేవి గారి లాంటి వాళ్లంతా ఇందులో పాల్గొని సదస్సుకు గౌరవాన్ని తీసుకొచ్చారు... ఇటువంటి కార్యక్రమాన్ని మా దార్లవారు తమ శక్తినంతా ఉపయోగించి చక్కగా నిర్వహించినందుకు దార్లవారికి, కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచిన కొవ్వలి గోపాలకృష్ణ గారికి, అధ్యాపక వర్గానికి, పరిశోధక విద్యార్థులకు ,బయటి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ఆచార్యులకు మా అధ్యాపక వర్గం తరఫున ధన్యవాదాలు....
ఆచార్య పిల్లలమర్రి రాములు
.....
మాకు అందరికీ పెద్దాయన మా ఆచార్య పిల్లలమర్రి రాములు సర్. ఆయన మాటలే మా తెలుగు శాఖ పక్షాన చెప్పిన మాటలుగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
....
*హైదరాబాద్ విశ్వవిద్యాలయం మరియు గురజాడ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేయటానికి నాకు అవకాశం కల్పించిన గురువులకు హృదయపూర్వక నమస్కారాలతో ధన్యవాదాలు. చాలా చక్కగా గురజాడ అప్పారావు గారి కుటుంబ సభ్యుల సమక్షంలో గురజాడ వారితో వారికున్న అనుభవాలను పంచుకొనేలా మాట్లాడిచటం వలన చాలా విషయాలు తెలుసుకోగలిగినందుకు గురువు గారు ఆచార్య పిల్లలమర్రి రాములు గారికి ధన్యవాదాలు. ఒక సదస్సు నిర్వహించాలంటే అందరినీ కలుపుకుని అందరికీ ఆహ్వానం పలుకుతూ అటు విద్యార్ధులను ఇటు పరిశోధకులను ఆయా విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు మరియు అధ్యాపకులు ఇలా అందరినీ సమన్వయం చేసుకుంటూ రెండు రోజుల జాతీయ సదస్సును అద్భుతంగా నిర్వహించిన గురువు గారు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు ధన్యవాదాలు సార్. అదే విధంగా మిగిలిన ఆచార్యులందరి సహకారం అమోఘం వారందరికీ హృదయపూర్వక నమస్కారాలతో💐🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻*
-డా.ముకుందరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ,
.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి