(ప్రవేశిక పత్రికలో మువ్వా శ్రీ మీద దార్ల వ్యాసానికి స్పందిస్తూ, ఇందాకా సిరికోనలో 👇)
ఇం
దులో మన సభ్యులైన ఆచార్య దార్ల, మరో సభ్యులైన క్రాంతి (మువ్వా) శ్రీనివాసరావు గారి కవిత్వం మీద రాసిన వ్యాసం అవశ్యం అభినందనీయమైంది... చాలా చక్కగా, చిక్కగా క్రాంతిశ్రీ కవిత్వాన్ని వివేచించారు... మువ్వా గారంటేనే చిక్కటి కవిత్వానికి పెట్టింది పేరు... కవితోత్సవాలకు కళాశాల లాటి పేరు.. అతి సాంద్రమైన ఊహలు, అందుకు విరుద్ధంగా అతి తేలికయైన అభివ్యక్తులు, అద్భుతమైన విరుపులు, వాటి వెన్నంటి సామాజిక స్పృహ పెంచే చరుపులు... ఆయన *వాక్యాంతం* లో పంక్తులు:
" వాక్యం నిప్పులా ఉండదు
కానీ,
సెగ పుట్టిస్తుంది
వాక్యం మంచులా ఉండదు
కానీ,
వణుకు పుట్టిస్తుంది వాక్యం మల్లెపువ్వులా ఉండదు
కానీ, పరిమళిస్తుంది ..etc.."
చదవంగానే హృదయాన్ని పట్టేసే మాటలు...
"24 ఇంటూ 7 చిరుత పులి కళ్ళతో చెలరేగుతూనే
ఇంటింటికీ నిజాన్ని చెప్పాల్సిన వాడు
అ
ర్ధాం
త
రం
గా
వార్తను వధిస్తుంటాడు..."
కంటపడంగానే కవుల వీపు మీద కూడా ఛళ్ళున చరిచే వ్యాఖ్యా- ప్రయోగం...
ఇలాటి చక్కటి ఉదాహరణలతో, ఆ ఉన్న కొద్ది పాటి వ్యాస పరిధిలోనే క్రాంతిశ్రీ కవితాకాంతిని కొండంత దీపం చేసి చూపారు దార్ల... ఒకప్పుడు ఇలాటి మంచి కవితల్ని కోనలో కూడా పంచేవారు మువ్వాశ్రీ.. కానీ తగిన చప్పట్లు లేవని కాబోలు విరమించారు..
(అప్పట్లో వాట్సప్ ఈ చప్పట్ల ఇమోజీ సౌకర్యాన్ని ఏర్పరచలేదు, కాబట్టి కోన తప్పెలా అవుతుంది... అయినా సామాజిక కవిత్వంలో, ఎవరి భుజాలు వారు తడుముకొనేలా ఉంటుంటే, చప్పట్లు కొట్టటానికి ఎలా సాధ్యమౌతుంది.. అందరి కవుల్లాగే క్రాంతిశ్రీ కూడా ....!)


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి