రెండు దశాబ్దాల వివాహ వార్షికోత్సవం 18.08.2023
మాకు పెళ్లయి ఇప్పటికి (18.8.2023) రెండు దశాబ్దాలు అయింది ఈ సందర్భంగా నిన్న మా విద్యార్థులతో కలిసి అహోబిలం ఆలంపూర్ యాగంటి పుణ్యక్షేత్రాలు దర్శించాం. ఉదయమే కిరణ్ తన వెహికల్ తీసుకొచ్చాడు. నేను, మంజుశ్రీ బాబు, కృష్ణవేణి, వనజ, రాంప్రసాద్.. అందరూ కలిసి బయలుదేరాం. ముందుగా జోగులాంబ దేవాలయానికి వెళ్లి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడ శ్రీ ఉమా మహేశ్వరుల దర్శనం, వేంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మరలా అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్ళాం.
ఈసారి మూడు చోట్ల చాలా బాగా దర్శనం అయింది. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఎనిమిది గంట ప్రాంతంలో దర్శనం జరిగింది అంతకుముందు వెళ్లినప్పటికీ అంత బాగా దర్శనం జరగలేదు. కానీ, ఇప్పుడు గర్భాలయంలోకి వెళ్లి దర్శనం చేసుకుని చాలా సంతోషం పొందాం.
ఈ దేవాలయాల దర్శనానికి ఎన్నిసార్లు చేసినా మరలా ఏదో కొత్తదనం కనిపిస్తుంది.అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ నిర్మాణం దారిలోని శిల్ప సంపద ఎంతో అబ్బురపరుస్తుంది.
ఈ సందర్భంగా మా విద్యార్థులు మాకు శుభాకాంక్షలు అందజేస్తూ మెసేజలు, వాట్సాప్ స్టాటస్, ఫేస్బుక్ మెసేజ్...ఇలా ఒక ఆనంద కెరటమయ్యారు.
ప్రతి ఏడాది మా విద్యార్థులతో ఇలా వివాహ వార్షికోత్సవము నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది మరింత ఆనందంగా ఉంది.





































































కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి