*స్వేచ్ఛను నియంత్రించుకోవడమే నేటి స్వాతంత్ర్య లక్ష్యం*
మనం సాధించుకున్న స్వేచ్ఛ ఇతరులకు హక్కులకు భంగం కలగకుండా నియంత్రించుకోవడమే నేటి స్వాతంత్ర్య దినోత్సవ లక్ష్యం కావాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. మంగళవారం (15.8.2023) నాడు జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా కూకట్ పల్లి లో పేద విద్యార్థులు, మురుగువాడల్లో నివశించే విద్యార్థులకు చదువుతో పాటు, సామాజిక చైతన్యానికి కృషిచేస్తున్న డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ కార్యాలయంలో ముఖ్య అతిథిగా హాజరై భారతజాతీయ జెండాను ఎగురవేశారు. సొసైటీ కార్యదర్శి, నిర్వాహకులు, అడ్వకేట్ అరుణ చావా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేదవిద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించడం తోపాటు, దేశభక్తులు, సంఘసంస్కర్తలు, స్వాతంత్ర్య ఉద్యమ నాయకుల చిత్రపటాలతో ముందుగా ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో డా.ఆర్.కళ్యాణ్, మహేశ్వర్ రెడ్డి, డా.రామ్ ప్రసాద్ నలసాని,అశ్వినీ, తేజశ్వనీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
.jpg)
.jpg)










కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి