"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

01 ఆగస్టు, 2023

తెలుగు శాఖను సందర్శించిన కవి కొమ్మవరపు విల్సన్ రావు గారు

 మొన్న సోమవారం (14.11.2022)నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి పల్లిపట్టు నాగరాజు, నేను కలిసి.. ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారిని కలుద్దామని వెళ్ళాము.ఎల్ బి నగర్ లో మెట్రో ఎక్కి మెట్రో చివరి స్టేజ్ లో దిగాక దార్ల గారికి ఫోన్ చేసాము. అదే దారిలో ఆచార్య Ramulu Pillalamarri  గారు వస్తున్నారు.. వారికి నేను చెబుతాను, వారి కారులో రమ్మని, వారికి కూడా చెప్పారు ఆచార్య దార్ల గారు. మేము వున్న ప్రదేశం రాములు గారికి చెబితే.. వారు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా తన కారులో యూనివర్సిటీ కి తీసుకెళ్లారు. కారులో ఎన్నెన్ని కబుర్లో!. నేను, రాములు గారు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ కలుసుకున్నామో సార్ చెబుతుంటే, నాకు భలే ఆశ్చర్యమైంది.వారి నిష్కల్మషమైన నవ్వు ముందు నేను ఫిదా అయిపోయాను.


యూనివర్సిటీ కి వెళ్ళాక పల్లిపట్టు కు కేంద్ర సాహిత్య యువ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆచార్య దార్ల గారు.. వారి క్లాస్ రూమ్ లో పిల్లలమర్రి రాములు గారు, MA విద్యార్థుల సమక్షంలో పల్లిపట్టు ను సత్కరించారు. మేమిద్దరమూ మా కవితా సంపుటిలోని టైటిల్ పోయేమ్స్ చదివాము. సుమారు దెబ్బయి మంది విద్యార్థులు.. ఎంత ఆసక్తిగా విన్నారో!.నా కవితా సంపుటి *దేవుడు తప్పిపోయాడు* ను ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారికి, ఆచార్య పిల్లమర్రి రాములు గారికి, యూనివర్సిటీ గ్రంధాలయం కోసం రెండు కాపీలు అదే వేదికపై అందజేశాను. మధ్యాహ్నం డీన్ ఆచార్య వి. కృష్ణ గారిని వారి ఛాంబర్ లో కలిసినప్పుడు పల్లిపట్టు కు అభినందనలు తెలుపుతూ పూల బొకే, శాలువాతో డిపార్ట్మెంట్ ఆచార్యులందరి సమక్షంలో సత్కరించారు. నా కవితా సంపుటి ఆచార్య కృష్ణ గారికి ఇచ్చినప్పుడు .. వారు ఎంతో ఉత్సకతతో  నా కవితా సంపుటి *దేవుడు తప్పిపోయాడు* టైటిల్ పై దేవుడు తప్పిపోయాడు అని టైటిల్ పెట్టాలంటే ఎంత ధైర్యం కావాలి అని వ్యాఖ్యానం చేయడం, లోపలి కవితల టైటిల్స్ ను మెచ్చుకొని, తప్పక చదివి స్పందిస్తాను అనడం నాకెంతో ఆనందం వేసింది. యూనివర్సిటీ వారి గెస్ట్ కాంటీన్ లో అందరం కలిసి లంచ్ చేయడం( నాకు చాలా నచ్చింది ), సాయంత్రం ఆచార్య దార్ల వారు తన కారులో మమ్మల్ని లింగంపల్లి రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయడం...ఇదంతా చూస్తుంటే ఉన్నతులు ఎపుడు ఉన్నతంగానే ఆలోచిస్తారు.. విజేతల ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగానే ఉంటాయి అనే మాటలు గుర్తుకొచ్చాయి.మేము యూనివర్సిటీకి చేరుకున్నప్పటి నుండి చివరిదాకా మా వెంటే ఉండి ఫోటోలు తీసిన MA తెలుగు విద్యార్థి లిఖిత్ కుమార్ అభినందనీయుడు.ఆ రోజును నేనైతే నా జీవితంలో మరచిపోలేని రోజు. మమ్మల్ని మనసారా అభినందించి, తమ ఆశీస్సులు ఇచ్చి, ప్రేమ పంచి మనసారా ఆలింగనం చేసుకున్న ఆచార్య కృష్ణ గారికి, ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారికి, ఆచార్య పిల్లలమర్రి రాములు గారికి, మిగతా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కు మేమెంతో ఋణపడి ఉంటాము.ఇది కదా సృజనకు దక్కే గౌరవం అనిపించింది.... విల్సన్ రావు కె. ( ఫేస్ బుక్)

కామెంట్‌లు లేవు: