సందమామ 'చందమామే'
ఓ సంద్రమా
నువ్వు నాకీ జన్మకందవనుకున్నాను
నిన్ను నేనందుకుంటున్నానని తెలియగానే
నాపై మేఘాలు పుష్పజల్లులయ్యాయి
నా చుట్టూ కమ్ముకున్న మిణుగురులన్నీ
నక్షత్రాల్లా ఆశతో ప్రాణం పోసుకున్నాయి
నిన్నందుకునేందుకెంత పరుగుపెట్టానో
నిన్ను చూడగానే మాటలన్నీ
నా గొంతులోనే పూడ్చేసుకున్నట్లు
నా కాళ్ళూ,, చేతుల్ని కట్టేసారెవరో
ఎంతగింజుకున్నా
గెలవాలనుకున్నా
నా ప్రయత్నమంతా
కలలపరుగుల పందెమే అయ్యిందిగా!
నా సందమామ
కాదు
ఆ చందమామ
అక్కడెంత అందంగా ఉంది
ఎన్నో జన్మలనుండీ ముడివిడువని
భూమీ-ఆకాశం
నిత్యమొకరినొకరు యెడతెగనిబంధంలా
పార్వతీ పరమేశ్వరులైన జంటలో
మూర్తీభవించిన తేజోపుంజం!
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
27.7.2023, 11.59.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి