చరిత్ర, సంస్కృతుల భద్రపరచడంలో
భావజాల వైరుధ్యాలు విడనాడాలి
డిజిటల్ హ్యుమానిటీస్ అనేది మానవుల కోసం, మానవులే యంత్రాలు, అనేక శాస్త్రాల సమన్వయంతో పనిచేసే ఒక వ్యవస్థ అనీ, భవిష్యత్తులో ఈ దిశగా విస్తృతమైన పరిశోధనలు జరిగే అవకాశం ఉందనీ, అయితే మన చరిత్ర, సంస్కృతులను భద్రపరుచుకునే విషయంలో భద్రతాపరమైన సాఫ్టవేర్లు రూపొందించుకోవలసిన అవసరం ఎంతో ఉందని హెచ్.సి.యు తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గత రెండురోజులుగా (9,10 ఫిబ్రవరి 2023) తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ సహకారంతో కరీంనగర్ లోని శ్రీరాజరాజేశ్వరీ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో, హైబ్రిడ్ మోడ్ (ప్రత్యక్షంగాను, అంతర్జాలం ద్వారాను) జరుగుతున్న ‘భారతీయ సాహిత్యం సంస్కృతిలో డిజిటల్ హ్యుమానిటీస్ అన్వేషణ, సవాళ్ళు అనే జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో గురువారం నాడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. చరిత్ర, సంస్కృతులను డిజిటీకరణ చేసేటప్పుడు భావజాలం వల్ల నిజమైన చరిత్ర, సంస్కృతలను అందించడంలో వక్రీకరణకు పాల్పడే అవకాశం కూడా ఉంటుందని, ఈ విషయంలో పారదర్శకత, నిజాయితీ ఎంతో అవసరం అని ఆచార్య దార్ల అన్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ లో ఆ యా రంగాల్లో నిపుణులైన వారు వారి భావజాలం ప్రకారం తమ తమ వెబ్ సైటులలో పెట్టే చరిత్ర, సంస్కృతులను గమనిస్తే, నిజమైన చరిత్ర, సంస్కృతలను అందించకుండా తాము అందించిన వాటినే గొప్పవిగా ప్రచారం చేసుకొంటున్న పరిస్థితి కనిపిస్తుందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఇప్పటికే తెలుగు భాషా, సాహిత్యాల వరకే చూసినప్పటికీ ఇంటర్నెట్ లో లభ్యమవుతున్న చరిత్ర, సంస్కృతులు, పుస్తకాలు వక్రీకరణలకు, భావచౌర్యానికీ గురవుతున్నాయనీ, వాటిని నిరోదించే భద్రతాపరమైన సాప్ట్ వేర్స్ రూపొందించుకోకపోతే ఆ చరిత్ర, సంస్కృతలకు సంబందించిన వీడియోలు, పుస్తకాలు వక్రీకరణకు గురయ్యే ప్రమాదం ఉందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు హెచ్చిరించారు. మానవులు చేసిన యంత్రాలే మానవుల్లో ఉన్న ఆర్థిక, మానసిక శక్తులను ఇంటర్నెంట్ ద్వారా వశీకరణ చేసుకొని దోపిడీకి గురిచేసే ప్రమాదం కూడా ఉందని, బాగా చదువుకున్నవాళ్ళు కూడా ఇప్పటికే సైబర్ దోపిడీలకుగురవుతున్నారని ఆచార్య దార్ల సోదాహరణంగా వివరించారు. డిజిటల్ హ్యుమానిటీస్ విద్యా, ఉద్యోగ, వాణిజ్య, ఆరోగ్య, పర్యావరణ, న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థలన్నింటిలోను శక్తివంతంగా ఉపయోగించుకోగలిగే అవకాశాలు ఉన్నాయనీ, అదే సమయంలో మానవుడు ఏకాకితనానికిీ, అభద్రతకు గురయ్యేపరిస్థితులు ఏర్పడతాయని వెంకటేశ్వరరావు చెప్పారు. డిజిటల్ హ్యుమానిటీస్ వల్ల రాబోయే రోజుల్లో డిజిటల్ వెల్ నెస్ సెంటర్స్ కూడా అవసరమవుతాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ జాతీయ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ డా. కలవకుంట రామకృష్ణ, సదస్సు కన్వీనర్, తెలుగుశాఖ అధ్యక్షులు డా. కొత్తి రెడ్డి మల్లారెడ్డి, కో కన్వీనర్లు డా.పోగుల విశ్వప్రసాద్, డా.కె.శారద, ఆంధ్రప్రదేశ్ జియస్ టి, అసిస్టెంట్ కమీషనర్ (విజయవాడ) సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్, శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎం.వరప్రసాద్, ఎన్ ఐ వరంగల్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య ఆనంద్ కిషోర్ కోలా, డా.పాత అశోక్, ఎం.వెంకటేశ్వర్లు, డా.పి.చైతన్య . డా.పి.అనిల్ తదితరులు ఈ జాతీయసదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి