ఆచార్య దార్ల ను కలిసిన తెలుగు పాఠ్యపుస్తక సమన్వయ కర్త, రచయితలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ సి ఇ ఆర్ టి ( s c e r t) ద్వారా రూపకల్పన చేస్తున్న 9వతరగతి పాఠ్యపుస్తకానికి సంపాదకులుగా వ్యవహరి స్తున్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వ రరావుని మంగళవారం నాడు మర్యాద పూర్వకంగా కలిసి పుస్తకాన్ని అందచేసారు. ప్రభుత్వ ఉద్దేశ్యాను సారం, మానవీయ విలువలకు సాహితీ విలువల మేళవింపుగా ఈ పాఠ్యపుస్తకాన్ని రూపొందిస్తున్నామని పాఠ్యపుస్తక సమన్వయ కర్త డా. టి.పి.యస్. రమేష్ తెలియజేసారు . 2023 జూన్ నుండి ఈ పాఠ్యపుస్తకం విద్యార్థులకు అందించే ప్రయత్నంలో ఉన్నామని డా.టి.పి.యస్.రమేష్ తెలిపారు. ఈ పాఠ్యపుస్తకాన్ని పరిశీలించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తన ఉత్తమాభిరుచికి ఉన్నతాశయానికి ఈ పుస్తకం ' దిక్సూచిగా ఉండుందని భావిస్తున్నానని తెలిపారు. ఈ పుస్తకం రచయితల బృందం నుండి డా॥ వూటుకూరి వరప్రసాద్ ఈ కార్యక్రములో పాల్గొన్నారు.
సాక్షి దినపత్రిక, 1.2.2023 సౌజన్యంతోతెలు టైమ్స్ దినపత్రిక 1.2.2023 సౌజన్యంతో
నమస్తే న్యూస్, 1.2.2023 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి