కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీతకు సన్మానం
శేరిలింగంపల్లి, నవంబర్14(నినాదం న్యూస్)
యువసాహితీవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా తెలుగులో 2022 వ సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన పల్లిపట్టు నాగరాజుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, తెలుగు శాఖ ఆధ్వర్యంలో సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా పల్లిపట్టు నాగరాజు మాట్లాడుతూ తన కవిత్వాన్ని చదివి వినిపించారు. సాహిత్యంలో నమోదుకావాల్సిన విషయాలెన్నో ఉన్నాయనీ వాటిలో తన జీవితం కూడా వస్తువుగా రాసిందే తన కవిత్వమని నాగరాజు వివరించారు. ఈసందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు నాగరాజుని ఘనంగా సత్కరించారు.అనంతరం వర్సిటీ లో ఉన్న తెలుగు శాఖ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. సందర్భంగా స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, హెచ్.సి.యు. అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, తెలుగు అధ్యాపకులు ఎం.గోనానాయక్, డి.విజయలక్షిడా.భూక్యా తిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.దాసర విజయకుమారి, ప్రముఖ కవి విల్సన్ రావు కొమ్మవరపు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి