అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు?
పుస్తకావిష్కరణ విశేషాలు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నినాదం న్యూస్) -డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఉండకపోతే దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం విక్రమ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మతఛాందసవాద శక్తులు రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తుందని చెప్పారు. ప్రముఖ దళిత రచయిత లాడే ధనుంజయ రాసిన అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు? అనే శీర్షికతో రాసిన పుస్తకాన్ని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు శ్రీపతి రాముడు, దార్ల వెంకటేశ్వరరావుతో కలిసి టి యు డబ్బు జే రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ... భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాడే ధనుంజయ రాసిన "డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు" అనే పుస్తకం పై సమీక్ష చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుల వ్యవస్థ పై ప్రస్తావించిన కారల్ మార్క్స్ భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ సమస్యను కనుగొనలేకపోయాడని ఆ పని అంబేద్కర్ ప్రారంభించారని చెప్పారు. ప్రజలంతా భౌగోళిక తెలంగాణ కోరుకుంటే కుల వ్యవస్థ నశిస్తుందని అందోళన వ్యక్తం చేశారు. చందానగర్ లోని పీజేఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు మాట్లాడుతూ భారత దేశనాయకత్వం మొదటి నుండి అంబేద్కర్ పై వివక్ష చూపుతూనే ఉందని అన్నారు. పార్లమెంటులో కూడా నాటి నెహ్రూ ప్రభుత్వం అంబేద్కర్ సామర్ధ్యానికి తగిన పదవి ఇవ్వలేదని అన్నారు. దీంతోపాటు సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలన్న అంబేద్కర్ డిమాండ్ ను కూడా ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. భారత దేశ విదేశాంగ విధానంలో నెహ్రూ ప్రభుత్వం ఒంటెద్దు పోకడ అలంభించిందని విమర్శించారు. మహిళలను మనువాదం కేవలం మరమనుషులుగా మాత్రమే చూసిందని, వారికి ఎలాంటి హక్కులు ఇవ్వలేదని అన్నారు. అంబేద్కర్ ప్రజా సంఘంరాష్ట్ర అధ్యక్షులు కట్టలు మల్లేశం మాట్లాడుతూ ఆధునిక సమాజానికి దూరంగా ఉంచిన మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు ఇవ్వాలని అంబేద్కర్ హిందూకోడ్ బిల్లును తీసుకురావడం జరిగిందన్నారు. దీనిని కూడా ఆనాటి పార్లమెంటు చర్చకు తీసుకు రాలేదని విమర్శించారు. నూటికి 90 శాతంగా ఉన్న ఎన్నీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల అభ్యున్నతికి వ్యతిరేకంగా నెహ్రూ ప్రభుత్వం వ్యవహరించడం వలననే అంబేద్కర్ రాజీనామా చేశారని తెలిపారు. బీసీ రజ్ జాతీయ అధ్యక్షులు దుండ్రు కుమారస్వామి మాట్లాడుతూ ఆరోజు అంబేడ్కర్ కోరుకున్న విధానాలను ఇప్పటికీ పాలకులు అమలు చేయడం లేదని విమర్శించారు. అందుకోసమే అభివృద్ధిలో భారతదేశ చాలా వెనకబడిపోయిందని అన్నారు. దీనికి తోడు బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని మార్చాలని నేటి మనువాడ పాలకులు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏ ఒక్క కులానికి, మఠానికి, వర్ణానికో కాకుండా, సర్వ మానవాళి సకల జీవరాసులు రక్షణతో పాటు స్వేచ్ఛాయుత జీవనానికి అవకాశం కల్పించారని కొనియాడారు. అంబేద్కర్ యువజన శక్తి అధ్యక్షులు దళిత రత్న ఎం. విమల్ కుమార్ మాట్లాడుతూ అసమానతలకు, మనువాదం, సమానత్వాన్ని కోరుకునే మానవతా వాదానికి మధ్యనే దేశంలో యుద్ధం జరుగుతుందని అన్నారు. అత్యధిక శాతంగా ఉన్న బహుజనులు, అభ్యుదయవాదులందరూ పూలే, అంబేద్మర్ లు చూపిన బాటలో సమసమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.అభినందించారు. రచయిత మోటార్ నారాయణ మాట్లాడుతూ మనువాడని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమల్లో ఉన్న భారత రాజ్యాంగాన్ని కించపరినే విధంగా సర్వీర్యం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాడే ధనుంజయ రాసిన పుస్తకంలో ప్రజలు ప్రజలను ఆలోచింపజేసే అనేక అంశాలు పొందుపరిచారని ప్రశంసించారు. సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్యర్ రాజీనామా రాజీనామాకు ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయననీ అందులో ప్రధానంగా అంబేద్కర్ స్థాయికి తగ్గ క్యాబినెట్ హోదా ఇవ్వకపోవడం, అత్యధికంగా ముస్లింలు ఉన్న కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలిపేయడం ద్వారా శాశ్వత సమస్య పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాలని సూచించారనీ,, షెడ్యూల్డ్ కులాలు తెగలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు వంటివే బీసీ వర్గాలకు కూడా దక్కాలనే అంశం పై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరారని అన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలని కోరారనీ ఆయన వివరించారు. అప్పటి క్యాబినెట్లో ఉన్న మంత్రులు దానికి సహకరించనందుకు నిరసనగా తన మంత్రి పదవిని త్యాగం చేశారని ఈ అంశాలన్నీ లాడే ధనుంజయ తన పుస్తకంలో సాధారణ ప్రజలకు కూడా అర్ధమయ్యే రీతిలో వివరించారని అన్నారు. టీయూడబ్ల్యుడే రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ చరిత్రము కొన్ని వర్గాలు తమకు అనుకూలంగా మార్చు వక్రీకరిస్తుంటారని అన్నారు. సింహాలు తన చరిత్ర చెప్పుకోకపోతే వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుందని సామెత అక్షరాల నిజమవుతుందని అన్నారు. అసమానతలు లేని సమాజం నిర్మించాలని తపనపడ్డ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంతో ఆదర్శప్రాయుడనే కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. దళిత సాహిత్య రచయిత లాడే ధనుంజయ మాట్లాడుతూ. ప్రజలలో పుస్తక పఠనం అలవాటు తగ్గిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ స్త్రీలకు సమాన గౌరవం కల్పించేందుకు హిందూ కోడ్ బిల్లు అమలు కోసం అంబేద్కర్ చేసిన ప్రయత్నాలు చివరికి పదవి త్యాగం చేసేవరకు వెళ్లిందని అన్నారు. హిందూ కోడ్ బిల్లు అమలు కోసం ఆయన సాగించిన పోరాటం ఆయన మహెన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని చెప్పారు. హిందూ కోడ్ బిల్ అమలు కాకుండా అప్పటి ప్రధాని జనహర్లాల్ నెహ్రూ తో పాటు వల్లభాయ్ పటేల్ రాజేంద్రప్రసాద్ అడ్డుకున్నారని వివరించారు. స్త్రీల కోసం అంబేద్కర్ చేసిన త్యాగం చరిత్రలో మరువలేనివని ప్రతి స్త్రీ మూర్తి కి ఆయన ఆరాధ్యుడని స్పష్టం చేశారు.. సీనియర్ జర్నలిస్టు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగినఈ కార్యక్రమంలో సినీ నిర్మాత గాలి గిరిధర్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం, ఎస్సీ సెల్ అధ్యక్షులు రఘునాధ్ సామాజిక కార్యకర్త దేవయ్య రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ దేవదాస్ కె.ఎస్. అదీ కాలనీ అధ్యక్షుడు సీవయ్యటి రాజేష్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
బిడిఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాడే ధనుంజయ గారు రాసిన "డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు" అనే పుస్తకాన్ని శుక్రవారం ( 21.10.2022) చందానగర్ లోని పి జె ఆర్ స్టేడియంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్ గారు ఆవిష్కరించారు.
సీనియర్ జర్నలిస్టు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మందగడ్డ విక్రమ్ కుమార్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు దార్ల వెంకటేశ్వరరావు, శ్రీపతి రాముడు, అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం, బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దండ్రు కుమారస్వామి, అంబేద్కర్ యువశక్తి, దళిత రత్న అవార్డు గ్రహీత మందగడ్డ ' విమల్ కుమార్, సినీ నిర్మాత గాలి గిరిధర్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి