"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

06 July, 2022

ఆచార్య దార్ల ఆత్మకథ -నెమలికన్నులు ( మొదటి భాగం) 6 జూలై 2022

 

ఆచార్య దార్ల ఆత్మకథ

 ‘‘నెమలికన్నులు’’

ఇటీవల ఓ ఇంగ్లీషు ప్రొఫెసరూ, నేనూ దళితుల గురించి ఏదో విషయంతో మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఎంతసేపు మాట్లాడుకున్నామో మాకే తెలియలేదు. అయినా మాకెంతో మాట్లాడుకోవాల్సింది ఇంకా ఉందనిపించింది. ఆ సందర్భంలోనే దళిత్ పర్సనల్ నెరేటివ్స్ పై కూడా చర్చించుకున్నాం.

ఆ సందర్భంలోనే ఆయన "మీరు కూడా మీ పెర్సనల్ నేరేటివ్  రాయకూడదూ?" అని నా వైపు చూశారు.

ఆ మాట నిజంగా నాకెంతో ఉత్సాహం కలిగించింది.

‘‘నా కవిత్వంలో  నాగురించి, నాలాంటి వాళ్ళ గురించే రాశాను కదా’’ అన్నాను చిరునవ్వుతో ముఖం పెట్టి. ‘కవిత్వంలో ఊహలు ఉంటాయనేది మన సాహితీవేత్తల్లో ఉండే ఒక అభిప్రాయం’ అని ఆయన నావైపు చూశారు- సమాధానం చెప్పండన్నట్టు.

దళిత కవిత్వానికి వాస్తవికతే ప్రాణంఅయినా కవిత్వం కంటే ఆత్మకథ అయితే సామాన్యులు కూడా చదివించుకొని అర్ధం చేసుకోగలుగుతారని మా ఇద్దరి సంభాషణల్లోని సారాంశంగా తేలింది. అందువల్ల ఎప్పటి నుండో నా ఆత్మ కథ  రాయాలని పిస్తుంది. అప్పుడే రాయడానికి నేనేమి  ఏమి సాధించానని ఆత్మకథ రాయాలనే ప్రశ్న కూడా ఎదురయ్యింది.కానీ, ఆయన మాటలు నా మనసు లోతుల్ని తడిమినట్లయ్యాయి. దాన్నలా ఆలోచిస్తున్నాను.

ఈలోగా, నా ప్రతి అక్షరాన్నీ ముద్రణ రూపంలో చూపించగల గొప్ప సాహసి సాకే శ్రీహరిమూర్తిగారితో కూడా ఒకసారి దళిత ఆత్మకథల ప్రస్తావన వచ్చింది. మీరే ఎందుకు రాయకూడదని అడిగారు. మళ్ళీ నాకు అదే ప్రశ్న ఎదురయ్యిందనిపించింది... నేనేమి సాధించానని ఆప్పుడే ఆత్మకథ రాయాలనుకున్నాను. అదే అభిప్రాయం శ్రీహరిమూర్తిగారితో కూడా అన్నాను. ఒక మారు మూల గ్రామం నుండి మీరొచ్చారు. మీ కుటుంబంలో మీరే తొలితరం విద్యావంతులు. అయినా మీరు సెంట్రల్ యూనివర్సిటీ వరకు వెళ్ళడం, డాక్టరేట్ సాధించడం, అక్కడే ఉద్యోగం చేయడం, అక్కడే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటుగా, అది ఆ డిపార్ట్మెంటులో అత్యంత చిన్నవయసులో ఆ హోదాకు రావడం, అన్నింటికీ మించి మీరు ఏస్థాయిలో ఉన్నా మీ మూలాల్ని మర్చిపోవకపోవడం... ఇవి చాలవా మీ ఆత్మకథ రాయడానికని అన్నారు. ఆ మాటలు నిజంగా నాకు గొప్ప బలాన్నిచ్చినట్లనిపించాయి. నా భుజమ్మీద చెయ్యేసి ముందుకెళ్ళమన్నట్లనిపించాయి.

 

                                        ***

ఊరికి చివరి గుడిసెలో బతికే వాళ్ళం. కులం అంట గట్టిన అవమానాల్ని ఇంకా మోయకతప్పని వాళ్ళం. చూపుల్తో, మాటల్తో నిత్యం నలిగిపోతున్నవాళ్ళం. మనిషిని చూసినా, మాటవిన్నా కలగని హీనత్వం మా కులం పేరు చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూస్తున్న వాళ్ళం. తాత ముత్తాతల నాటి నుండీ మడులూ మాన్యాలు మాకు అందకపోయినా తరతరాలుగా వెంటాడుతున్నవృత్తుల్ని నిస్సహాయంగా అనుభవిస్తున్నవాళ్ళం. ఒకవేళ ఆ వృత్తుల్ని చేయకపోయినా  ఎదుటివాళ్ళకెందుకో ఆనాటి మాజీవితాలే మా ముఖాల్లో కనిపిస్తున్నట్లు వాళ్ళ ముఖాల్ని చూస్తున్నవాళ్ళం. అలాంటి ఓ మాదిగ కులం నుండి యూనివర్సిటీకి వచ్చిన వాణ్ణి . సెంట్రల్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ అయ్యినవాణ్ణి. అక్కడే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన వాణ్ణి. సశషల స్పష్టతకెన్నోసార్లు నాలికతిరగట్లేదని మావాళ్ళగురించి వాళ్ళేవరెవరో మాట్లాడేటప్పుడల్లా ఆ మాటల్ని శూలాల్లా గుచ్చుకుంటుంటే భరించలేక వాళ్ళకంటే బాగా పలికనవాళ్ళెంతోమంది మాలో ఉన్నారని చూపించినవాణ్ణి. ఆ భాషలోనే అధ్యాపకుణ్ణయిన వాణ్ణి. అది చాల దా  నా కథ చెప్పడానికనిపించింది. అది చాలదా నా మనసు విప్పి చూపడానికనిపించింది.  నేను చదువుకొనేటప్పుడు ఎన్నో కలలు కంటూ  రాసుకున్న ‘వారసత్వం ?’ కవిత గుర్తొస్తుంది. మా ముత్తాత/చెప్పులు కుట్టేవాడు/మా తాత/ కూలికెళ్ళేవాడు/మా అయ్యేమో/ అక్షరం కోసం ఆశగా/ ఎదురు చూసేవాడు/నేనిప్పుడు/కవిత్వం రాస్తున్నాను/రేపు /నా కొడుకు /ప్రొఫెసరవుతాడు! డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సాధించిపెట్టిన హక్కులవల్ల వంశపారంపర్యంగా, నిర్భంధంగా ఆచరించవలసిన వృత్తులన్నీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి చేయాలంటే చేస్తారు. వద్దంటే మానేస్తారు. తమకిష్టమైన వృత్తిని ఎంచుకుంటారని ఇచ్చిన స్వేచ్చ నాలాంటివాళ్ళెంతోమందికి ఉపయోగపడింది. అవకాశం ఉంటే మావాళ్లు కూడా సాధించలేనిదేమీలేదని నిరూపిస్తున్న అనేకమందిని చూస్తున్నప్పుడల్లా నాకవిత్వంలో కలలు గన్న అంశాలు నిజమవ్వడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అయినా, మా కులం తెలియనంతవరకు ఎంతో గౌరవించేవాళ్లు, మాకులం తెలిసిన వెంటనే వాళ్ళ ముఖకవళికలన్నీ మారిపోతుంటాయి. అలాంటి సందర్భాలెన్నో...!

                వచ్చేవారం అలాంటి సందర్భాల్ని ఒకటో రెండో వివరిస్తాను.

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగుశాఖ అధ్యక్షులు,

 స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్. (సెంట్రల్ యూనివర్సిటి)

 హైదరాబాద్ -500 045, ఫోను: 9182685231


https://vrdarla.blogspot.com/2022/11/16.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 16వ భాగం

https://vrdarla.blogspot.com/2022/11/15.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 15వ భాగం

https://vrdarla.blogspot.com/2022/10/14.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 14వ భాగం

https://vrdarla.blogspot.com/2022/10/13.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 13వ భాగం

https://vrdarla.blogspot.com/2022/10/12.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 12వ భాగం

https://vrdarla.blogspot.com/2022/10/11-5102022.htmlఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 11వ భాగం

https://vrdarla.blogspot.com/2022/09/10.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 10వ భాగం

https://vrdarla.blogspot.com/2022/09/9.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు)  9వ భాగం

https://vrdarla.blogspot.com/2022/09/8.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 8వ భాగం

https://vrdarla.blogspot.com/2022/09/7.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 7వ భాగం

https://vrdarla.blogspot.com/2022/08/6.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 6వ భాగం

https://vrdarla.blogspot.com/2022/08/5.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 5వ భాగం

https://vrdarla.blogspot.com/2022/07/4.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 4వ భాగం

https://vrdarla.blogspot.com/2022/07/blog-post_20.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 3వ భాగం

https://vrdarla.blogspot.com/2022/07/2.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 2వ భాగం

https://vrdarla.blogspot.com/2022/07/6-2022.html ఆచార్య దార్ల ఆత్మకథ (నెమలికన్నులు) 1వ భాగం



No comments: