"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

11 July, 2022

గువ్వలు బయటకొచ్చే వేళ...


ఒక్కసారిగా గువ్వలన్నీ బయటకొచ్చేటప్పుడు 

వాటి కళ్ళను చూడాలి

ఆ గువ్వల కోసం ఎదురుచూసే‌ 

తల్లుల చూపుల్ని చూడాలి

తల్లుల్లా మారే తండ్రులు

గువ్వల నోట్లోకేదైనా అందించాలనే 

తపనను చూడాలి 

తన గువ్వని గాలిస్తూ 

రెప్ప వాల్చకుండా వరమిచ్చే దేవతల్లా

గుండెనిండా మమకారంతో ఎదురు చూసే 

తల్లుల్ని చూడాలి 

చేతినిండా తనకిష్టమయ్యే రుచులతో

ఎదురు చూసే తల్లుల్ని చూడాలి 

రాగానే తల్లీబిడ్డల ఆలింగనాల్ని

అనుభవించాలే తప్ప 

అంతే అందంగా వర్ణించలేరెవ్వరనే 

కవి మాట నిజమనాలి

ఆ కొద్దిసేపట్లోనే ప్రపంచాన్నంతా 

ఆ వచ్చీరాని మాటల్తో 

ముద్దతినడం కంటే ముద్దుగా బయటకొచ్చే

 మాటల్ని వినాలి 

ఆ గువ్వసిరిబొజ్జనెలాగోలా నింపాలనుకునే అమ్మల చూపులు చూడాలి

ఆ లాలింపులు

ఆ తియ్యని మమకారపు ముద్దులు

మన బాల్యాన్నొక్కసారి మన కళ్ళముందుకొచ్చి 

అక్కడ కనిపించకపోయినా 

గుండె నిండా పరుచుకున్న దృశ్యాల్ని చూడాలి

-దార్ల వెంకటేశ్వరరావు,

7.7.2022



(సూర్య దినపత్రిక, 11.7.2022 లో ప్రచురితం)


No comments: