"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 May, 2022

ఎదను తడిపిన చినుకు

 ఎదను తడిపిన చినుకు


అంతమంది లోనూ 

నాకళ్ళన్నీ నిన్నే వెతుకుతున్నాయి

నువ్వు కనిపించకపోతే 

ఇంతమంది లోనూ ఒక్కరున్నట్టూ నాకనిపించట్లేదు

ఇక్కడెవ్వరూ లేనట్లే అనిపిస్తోంది

అయినా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని

ఎందుకో మరలా మరలా 

ఆ మబ్బుల్ని ఒక్కొక్క దాన్నీ పక్కకు నెడుతూ 

నీ కోసమే అన్వేషిస్తున్నాను

ఇక్కడ నువ్వు కనిపించలేదు 

నువ్వే ఓ చినుకయ్యావేమో

ఎప్పుడు రాలిపోయిందో

నా కనులనుండి

నాయెదను తడిచేస్తూ

 దొర్లుకుంటూ జారిపోయింది!

  • దార్ల వెంకటేశ్వరరావు హైదరాబాద్

24.5.2022








No comments: