"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

28 మార్చి, 2022

ఇదో వయసు ముచ్చట

 నా వయసులోని నా మిత్రులంతా

ఏవయసుకాముచ్చటపడిన ప్రేమ పక్షులైతే
నేనేమో ఉన్నత చదువులూ ఉద్యోగాలంటూ
కలంనిండా సిరాతో కళ్ళజోడునయ్యాను
నా వయసులోని నా మిత్రులంతా
వాళ్ళ పిల్లల్ని ఉన్నత చదువుల కోసం
దేశదేశాల్నీ జల్లెడ పడుతుంటే
నేనేమో ఒక్క పితృ స్పర్శ కోసం
దేశదేశాల్లోని వైద్య రహస్యాల్ని అన్వేషిస్తున్నాను
నా వయసులోని నా మిత్రులంతా
వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తుంటే
నేనేమో మా వాడికి
జోల పాటల్ని పాడుతున్నాను
నా వయసులోని నా మిత్రులంతా
వాళ్ళ పిల్లల పిల్లల్ని ఎత్తుకుంటుంటే
నేనేమో మా వాడి తొలి అడుగుల
దృశ్యగీతికల్ని ఏరుకుంటున్నాను
నా వయసులోని నా మిత్రులంతా
తరాల వంతెనపై నిర్భయంగా నడిచిపోతుంటే
నేనేమో మావాడి కళ్ళల్లో మెరిసేవన్నీ
ఆనందాలో  విషాదాలో తెలియని
ఆ కన్నీటి పొరల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నాను
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 28.3.2022







కామెంట్‌లు లేవు: