'ఏపార్టీకీ కొమ్ముకాయకుండా నిలబడలేని పరిస్థితే నేటి జర్నలిజం ధోరణి'
నేడు ప్రతి పత్రికా ఏదో ఒక పార్టీకి లేదా ఏదో ఒక భావజాలానికి కట్టుబడి ఉండడం నేటి పత్రికా ధోరణిలో కనిపిస్తున్న ఒక ముఖ్యమైన అంశమని, ఏ భావజాలానికి, ఎవరి ప్రభావానికి లోనుకాని పత్రికలు ఎక్కువ కాలం మనజాలడం కష్టమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహిస్తున్న ధర్మనిధి ప్రసంగ పరంపరలో సోమవారం (20.12.2021) ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఎన్ ఆర్ చందూర్ ధర్మనిధి స్మారక ఉపన్యాసంగా' తెలుగు జర్నలిజంలోనేటి ధోరణలు' అనే అంశంపై ప్రసంగించారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య పిస్తాలు శంకర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూకరోనా తర్వాత తెలుగు జర్నలిజంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయని చిన్న పెద్ద పత్రికల తేడాలు చెరిగిపోయిన ఒక పరిస్థితి కనిపిస్తోందని ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు వ్యాఖ్యానించారు. జర్నలిజానికి సంబంధించి కొన్ని సూత్రాలు నియమాలు ఉన్నాయని వాటిని పాటిస్తూ ఉన్నతమైన విలువలతో నడుపుతున్న పత్రికలు, న్యూస్ ఛానెల్స్, వెబ్ న్యూస్ ఛానెల్స్ ఉన్నాయని మరికొన్ని సంచలనాలకు ప్రాధాన్యతను ఇస్తున్నాయని ఆయన సోదాహరణంగా వివరించారు. సామాజిక మాధ్యమాలు ఒక జర్నలిస్టు కంటే అత్యంత ప్రముఖమైన పాత్రను నిర్వహించడం మనం గమనించవలసిన ఒక ధోరణిగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సినీగేయ రచయిత భువనచంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో డా.నిర్మలాపళనివేలు, జి.మహేశ్వర్ రెడ్డి, ఆచార్య కొలకలూరి మధు జ్యోతి, ఎన్.ఆర్.చందూర్ ధర్మనిధి పురస్కారం సంఘం సభ్యులు రామకృష్ణ, మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి వి రత్నాకర్, గుడిమెట్ల చెన్నయ్య డాక్టర్ పాండురంగం కాళీయప్ప, డాక్టర్ మాదా శంకర్ బాబు, మన్నారు కోటేశ్వరరావు తదితరులు ఈకార్యక్రమంలో పొల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి