"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

25 October, 2021

ఉపాధ్యాయులే సమాజ దార్శనికులు

 ఉపాధ్యాయ లోకమంతా కవులు, కళా కారులు,రచయితలు  కావాలి. సామాజిక మార్పుకు సారథులుగా నిలవాలి!!!

**************************

- వడ్డేపల్లి మల్లేశము9014206412

***25..10..21---------------------


      ఉపాధ్యాయుని యొక్క పాత్రను ఒక రాష్ట్రానికి ఒక దేశానికో పరిమితం చేయలేము. అంతర్జాతీయ స్థాయిలో పాఠశాల విద్యా వ్యవస్థ, బోధనాభ్యసన ప్రక్రియ, తరగతిగది, విద్యార్ధి ఉపాధ్యాయులు కొద్ది తేడాలతో  ప్రపంచమంతా ఒకే రకమైన  విధానం అమలులో ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యా వ్యవస్థ అనే నాటకరంగంలో సూత్రధారిగా వ్యవహరిస్తే విద్యార్థి పాత్రధారిగా తన ప్రతిభను రుజువు చేసుకోవలసి ఉంటుంది. కనుక ఉపాధ్యాయ విద్యార్థి బంధం, బోధనాభ్యసన ప్రక్రియ, చెప్పే వాళ్ళు విని ఆలోచించి ప్రశ్నించే వాళ్ళు అనే ఉభయ వర్గాలు  విద్యార్జనలో తరచుగా సమాజం దృష్టికి వస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళ నోట వింటూ ఉంటాము.

    ఉపాధ్యాయులు -సాహిత్య రంగం:-

    ***************

      తరగతి గదిలోనూ తరగతి బయట సమాజంలోనూ ఉపాధ్యాయులు పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ పరిస్థితులను విశ్లేషణ చేస్తూ విద్యార్థికి తన జీవిత అనుభవాలతో పాఠ్యాంశాలను జోడించి సామాజిక చింతన తో బోధనా  ప్రక్రియలో పాల్గొంటారు. పాఠ్యాంశము, పాఠ్యప్రణాళిక ఉపాధ్యాయుడికి కేవలం కరదీపిక మాత్రమే. బోధన గాడి తప్పకుండా ఉండేందుకు ఉపకరించేదే కానీ పాఠ్యాంశం మాత్రమే విద్యార్థులకు సర్వస్వము కాదు. సరిపోదు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు తన పరిశోధన ధోరణితో విద్యార్థులను ఆలోచింపజేసి ప్రశ్నించేలా ప్రోత్సహిస్తూ ఉంటారు . ఇవాళ సాహిత్యరంగం సమాజాన్ని ముడిసరుకు గా తీసుకొని సామాజిక చింతన తో సమస్యలను పరిష్కారాలను తన భుజానికెత్తుకుని మోస్తూ ఉన్నది. అదే క్రమంలో సమాజానికి ప్రతిబింబమైన పాఠశాలలో భావితరాన్ని తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులలో భావావేశాన్ని, సమయస్ఫూర్తిని, భావి సవాళ్లను అధిగమించే చైతన్యశక్తిని ,సమస్యల పరిష్కారాలను విద్యార్థులు తెలుసుకునే వాతావరణాన్ని కల్పిస్తారు. అది మౌఖికంగా కావచ్చు. లిఖిత రూపంలో కావచ్చు.

    తరగతి గదిలో ఉపాధ్యాయుడు కేవలం ప్రశ్నలు-జవాబుల నే కాకుండా విద్యార్థుల అనుభవాలను, జ్ఞాపకాలను, ఊహలను, ఆలోచనలనూ రాయమని చెప్పినప్పుడు విస్తారంగా రాస్తూ ఉంటాడు. ఇక్కడ ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు గా, దారి దీపాలుగా, ఆలోచన కర్తలుగా పని చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలియకుండానే ఉభయులు తమ స్వతంత్ర ఆలోచనా విధానాలను అక్షర రూపంలోకి మార్చుతుంటారు. అదే సాహిత్యం. ప్రజల యొక్క హితాన్ని కోరేదే సాహిత్యం అయినప్పుడు పాఠశాలలో జరుగుతున్న ప్రక్రియ కూడా అదే లక్ష్యంతో పనిచేస్తుంటుంది. వ్యవస్థ మరింత ఉన్నతంగా ఉండాలని ఆశించే ఉపాధ్యాయులు విద్యార్థులు పరోక్షంగా సాహిత్యరంగం చేస్తున్న కృషిని చేసినట్టే లెక్క. 

      అందుకే ఉపాధ్యాయ లోకమంతా సామాజిక చింతన తో పని చేస్తున్నారు కనుక, పని చేయాలి కనుక సాహిత్యరంగంలో అంతర్భాగమని భావించవలసి ఉంటుంది. కవులు రచయితలు అంటే ప్రత్యేక వర్గం అని  రచనలు తమ నుంచి కావని తాము రచనలు చేయలేమని ఉపాధ్యాయులు అనుకుంటారు. కానీ నిరంతరం బోధనా, అధ్యయనము, పరిశీలనా సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు. కనుక వారి అనుభవాలే సాహిత్యం అవుతుంది. ఈ ఆలోచనను జీర్ణించుకున్న ఉపాధ్యాయులు లోకమంతా తప్పకుండా కవులు రచయితలు కళాకారులే.

     అయితే ఏం లాభం:-

    **(((******

     కవి లేదా రచయిత కళాకారుని యొక్క లక్ష్యం సామాజిక మార్పుకు దోహదపడాలనే ఆశయం. విద్యా రంగం యొక్క విస్తృత ఆశయం సామాజిక మార్పు ఉన్నతస్థాయిలో ఉండే వ్యవస్థా అంతిమంగా సమసమాజ స్థాపన. ఇక్కడ ఉపాధ్యాయులు, సాహిత్యరంగంలోని సృజనకారులు ఒకే ఆశయం కోసం పని చేస్తున్నారు. ఇది గమనిస్తే గానీ అర్థం కాదు.

        అందుకే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అనే సామెత మనకు ఉండనే ఉన్నది. తను చదువుతూ విద్యార్థులతో చదివిస్తూ, తను ఆడుతూ విద్యార్థులతో ఆడిస్తూ, తన ఆలోచిస్తూ విద్యార్థులను ఆలోచింపజేస్తు, తను ప్రశ్నిస్తూ విద్యార్థులతో ప్రశ్నింప చేసే అద్భుతమైన అవకాశం ఉపాధ్యాయ లోకానికి మాత్రమే దక్కింది. అందుకే సాహిత్య రంగంలో ఉన్న సృజనకారులలో ఎక్కువ మంది బోధనా రంగంలో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలనే మనం చూడవచ్చు.

      కవి, రచయిత ,కళాకారుడు తనను తాను నిత్యం పరిశీలించు కుంటూ సమాజాన్ని పరిశీలిస్తూ తప్పటడుగులు వేయకుండా  వ్యవస్థలో తప్పటడుగులు పాడకుండా తన ఆలోచన అంకితభావంతో ముందుకు నడుస్తూ ఉంటాడు. ఉపాధ్యాయ లోకం కూడా అదే రకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నది. అయితే ఉపాధ్యాయ లోకానికి  కొంత పరిధి ఉంటే రచయితలు కవులకు విస్తృతమైన పరిధిలో జీవిస్తున్నారు.

     ఉపాధ్యాయులు కూడా ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ తరాల మధ్య అంతరాలు తొలగించి భావి జీవితానికి సంసిద్ధం చేసే క్రమంలో విద్యార్థులను అద్భుత శక్తులు గా తయారు చేస్తారు. విద్యారంగము సాహిత్యరంగం లక్ష్యాలు, ఆదర్శాలు, సామాజిక చింతన, పరిశోధన, పరిశీలన అనే కోణంలో చూసినప్పుడు రెండు రంగాలు ఒకే బాధ్యతను నిర్వహిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు.

     ఉపాధ్యాయ లోకం ఇందుకు ఏం చేయాలి:-

  ******((

    పాఠశాల గ్రంథాలయం లోనూ తరగతి గది బయట గ్రంధాలయం లోనూ ఉపాధ్యాయులు విద్యార్థులు నిరంతరం అధ్యయనం చేసే ప్రత్యేకమైన వాతావరణాన్ని ఉపాధ్యాయ లోకం కల్పించాలి. అధ్యయనం చేయడంతో పాటు వచ్చిన ఆలోచనలను, మెచ్చిన అనుభూతులను,  తెచ్చిన మార్పులను రికార్డు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు కూడా తమ అనుభవాలను జ్ఞాపకాలను ఆలోచనాసరళిని అక్షర రూపంలో ఉంచాలి.

     బాలల కోసం రాయబడినది, బాలల చే రాయబడినది కూడాను బాల సాహిత్యమే అవుతుంది. కాబట్టి బాలసాహిత్యాన్ని పాఠశాలలో పరిపుష్టి చేయడం ద్వారా సాహిత్య రంగానికి చేదోడు వాదోడుగా ఉండడానికి ఉపాధ్యాయులు విద్యార్థులు  దోహద పడతారు.

     సామాజిక మార్పుకు చోదక శక్తులు ఎవరు?

*****

      ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మరింత ఉన్నతంగా ఉండాలని ఆశించే క్రమములో తమ తమ పరిధిలో అనేక మంది పని చేస్తూ ఉంటారు. రాజనీతిజ్ఞులు, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, చరిత్రకారులు, సామాజిక వేత్తలు, పరిశోధకులు ఈ రకంగా ఎదిగి వచ్చిన వారంతా అగ్ర భాగము విద్యారంగము నుండే వస్తున్నారనే విషయాన్ని మనం అంగీకరించాలి. విద్యా రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమాజాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా పరిశీలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక సాహిత్య రంగంలో వీరి పాత్ర గణనీయంగా ఉంటుంది.

 ఎంతమంది సాహిత్యరంగంలో  చోటు సంపాదిస్తే ఆ స్థాయిలో సమాజం వికాసము చెందుతుంది. అంటే ఉపాధ్యాయులు రచయితలు మార్గ నిర్దేశకులు గా చోదక శక్తులుగా  సామాజిక మార్పుకు సారథులుగా పని చేయడం వలన సమాజ వికాసము సాధ్యమవుతుంది. అందుకే మనం ఉపాధ్యాయ లోకమంతా సాహిత్య రంగంలోకి రావాలని ఆహ్వానించడం జరుగుతుంది. పరోక్షంగా చేస్తున్నటువంటి సాహిత్య సేవ ను ఉపాధ్యాయ లోకం గనుక గుర్తిస్తే అందరూ కవులు, కళాకారులు, రచయితలు అవుతారు. ఆ విషయంలో ఉపాధ్యాయ లోకం తామంతా సాహిత్య రంగం కుటుంబ సభ్యులo అనే భావనతో ఉండాలనేదే నా విజ్ఞప్తి.

    ఉపాధ్యాయ లోకం చేస్తున్నది అంతాఇంతా కాదు:-

**********

     రచయితలు, కవులు, కళాకారులు సమాజాన్ని పరిశీలిస్తూ తమ ఆలోచనలను రచనలుగా  మార్చుతూ ఉంటే ఉపాధ్యాయ లోకం విద్యార్థుల్లో ఆలోచనను ప్రశ్నించే ధోరణి అలవరచి బాల సాహితీవేత్తలుగా మార్చుతున్నది.. ఇప్పటికైనా ఉపాధ్యాయులు సాహిత్య రంగం లోని సభ్యులే అనే వాదనను అటు ఉపాధ్యాయ లోకం ఇటు సమాజం అంగీకరించాల్సిన అవసరం ఉన్నది.

       ప్రశ్నింప నేర్పడం అనేది ప్రధానంగా విద్యా రంగం చేస్తున్న పెద్ద అద్భుతం. ప్రశ్న అన్వేషణకు, ఆవిష్కరణకు ,ఆలోచనకూ, ప్రత్యామ్నాయానికి ,పరిణామానికి, వికాసానికి మూలం. కనుక ప్రశ్నింప నేర్పుతున్న ఉపాధ్యాయ లోకం సాహిత్య రంగం చేస్తున్నంత సామాజిక బాధ్యత మోస్తున్న దని ఇప్పటికైనా అంగీకరిస్తారని ఆశిద్దామ్.

 ఇదే సందర్భంలో పాఠశాలకు , పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా విశాల విశ్వంలో పరిశీలన పరిశోధన ధోరణితో విహరించాలని ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం ఉపాధ్యాయులు చోదక శక్తులుగా నిలవాలని విద్యార్థి లోకాన్ని విశ్వ సేవకు పంపించాలని తద్వారా రాజకీయ విలువల లో నూతన శకం ఆరంభం కావాలని దానికి పాఠశాలలే వేదికలు కావాలని మనసారా కోరుకుందాం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

No comments: