"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

27 October, 2021

ఆధునిక తెలుగు కవిత్వంలో వివిధ ధోరణులు.... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు




సమాజాన్ని చైతన్యవంతం చేయడంలోను, సత్వర పరిష్కారాన్ని సూచించడంలోనూ సాహిత్యం ఒక వైద్యుడులా పనిచేస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు దార్ల వెంకటేశ్వర రావు ఆచార్య.

శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కళాశాల ఎమ్మిగనూరులో 27.10.2021  వతేదీన నిర్వహించిన జాతీయ వెబినార్ లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. మొదటి నుండి తెలుగు సాహిత్యం సమకాలీన సమాజాన్ని ప్రతిఫలిస్తూనే ఉందని, దాని ప్రభావమే ఆధునిక తెలుగు కవిత్వంలో వివిధ ధోరణులు రావడానికి ప్రధాన కారణమని ఆయన వివరించారు. భారతదేశంలోని వివిధ పాలకులు ముఖ్యంగా ఆంగ్లేయుల పాలన వలన అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి, ఆ మార్పులు సాహిత్యంలో కూడా కనిపించాయని, దానితో తెలుగు సాహిత్యంలో కూడా ఆధునిక ప్రవేశం ఉందని ఆయన సోదాహరణంగా వివరించారు. తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు ఆధునికతకు బీజాలు వేశారని, దాన్ని సంస్కరణ దృష్టితో కందుకూరి,

ఈ ప్రభావం వలన తెలుగు కవిత్వంలో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత ఉద్యమ కవిత్వం, ప్రపంచీకరణ కవిత్వం, ప్రాంతీయ అస్తిత్వ చైతన్య కవిత్వం, సమాజానికి ఎటువైపు ఉండాలో తెలియని ఇటువంటి స్థితిలో పోస్ట్ మోడ్రన్ పోయిట్రీ కూడా వచ్చిందని , ఇలా సమాజానికి, సమాజ ప్రతిబింబంగా వచ్చిన తెలుగు కవిత్వం తన పాత్రను నిర్వహించిందని ఆయన సోదాహరణంగా వివరించారు. వస్తు నవ్యత, వైవిధ్యంతో పాటు రూపపరిణామంలో కూడా తెలుగు కవిత్వం తన ప్రత్యేకతను ప్రదర్శించిందని సూచిస్తుంది. ఈ సదస్సుకి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.మహాబ్ భాషా అధ్యక్షత వహించి ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో సాహిత్యం పట్ల చక్కటి అవగాహన కలిగిస్తాయని ఆయన అన్నారు.జాతీయ వెబినార్ కన్వీనర్ , వైస్ ప్రిన్సిపాల్ డా.పి.విజయకుమార్ మాట్లాడుతూ  సమకాలీన  సమాజాన్ని ప్రతిఫలించే  తెలుగు కవిత్వ ధోరణుల గురించి విశ్వవిద్యాలయ ఆచార్యులతో ఉపన్యాసాలను ఇప్పించడం ద్వారా విద్యార్ధుల్లో  చక్కని అవగాహన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు

 భూమి పుత్ర దినపత్రిక, 30.10.2021 సౌజన్యంతో

ఐక్యుఏసి కోర్డినేటర్ డా ఎం. సుశీలమ్మ మాట్లాడుతూ ఇటువంటి జాతీయ సదస్సులు కళాశాల ర్యాంకింగ్ నిర్ణయించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని అంతర్జాలం ద్వారా కాబట్టి మనకి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య దార్ల రావు గారు ఈరోజు  సమావేశంలో మాట్లాడుతున్నారు. . సమన్వయకర్త ఎమ్.వి.తిరుమలనాయుడు నాయుడు సమన్వయం చేస్తూ జాతీయ సదస్సులో వివిధ ధోరణుల గురించి ప్రస్తావనకు వచ్చిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు తెలుగు సాహిత్యం పట్ల చక్కటి అవగాహన కలిగించాలని మరింత సమయం ఉంటే ప్రతి దాని గురించి సోదాహరణంగా వివరించి అవకాశం ఉండేదని చెప్పి, వందన సమర్పణ చేశారు.విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



భూమిపుత్ర డాట్ నెట్ సౌజన్యంతో

No comments: