"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

12 జులై, 2021

ఒక సంభాషణ వాయిదా!


అందరిలా నీతోనూ పొడిపొడిగా మాట్లాడలేను
అందరిలా నీతోనూ
హడావిడిగా ఏవేవో శుభాకాంక్షలూ చెప్పలేను
నీతో నేను గుండె తడితో మాట్లాడాలి
నీతో నేను తడబడినా తమకంతో
ఆ తరగని మమకారంతో మాట్లాడాలి
నీతో నేను నిత్యం అందర్నీ పలకరించినట్లే
నీతోనూ మాట్లాడలేను
నువ్వు నాతోనూ-నేనూ నీతోనూ
నిత్యం నిశ్శబ్దంగా
ఒక ప్రకృతి సంగీతంలా మాట్లాడాలి
అయినా  నీతో నేను -నాతో నువ్వూ
విడివిడిగా మాట్లాడ్డమేంటి?
నువ్వు నాలోనూ -నేనూ నీలోనూ ఉంటే
అందరిలాగే నిన్నూ చూడగలనా?
పసి పిల్లాడు  స్విచ్చాఫ్ చేస్తూ  స్విచ్చాన్ చేస్తూ
పొందే ఆనందంలా
నా కనురెప్పల్లోనే దాగున్న నీతో
నా కనురెప్పల చప్పుళ్ళతోనే
దోబూచులాడ్డంమెంతో సరదాకదా
అందరిలా నీతోనూ నేనలా మాట్లాడలేను!
- దార్ల వెంకటేశ్వరరావు, 27.6.2021

కామెంట్‌లు లేవు: