తిలక్ కవిత్వం అమృతతుల్యం
విశాలాంధ్ర-కడప కల్చరల్ : తిలక్ కవిత్వం అమృతతుల్య మని హైదరా బాద్
కేంద్రీయ విశ్వ విద్యాలయ ఆచార్యులు దార్ల వెంకటేశ్వర రావు అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత
విద్యామండలి సంయుక్తంగా
నిర్వహిస్తున్న తిలక్ శతజయంతి సప్తాహం లో భాగంగా మంగళవారం జరిగిన రెండవ సదస్సుకు అధ్యక్షత
వహించిన ఆయన మాట్లాడుతూ తిలక్ కవిత్వం జన హృదయాన్ని కదిలించేదిగా ఉంటుందని, అది అనుభూతి ప్రధానం అని తెలిపారు. ద్రావిడ
విశ్వవిద్యాలయ ఆచార్యులు డా.కె. శ్రీదేవి తిలక్ కథల్లో ఉన్న స్త్రీ పురుష సంబంధాలపై ప్రసంగిస్తూ ఫ్యూడల్ భావజాల చట్రంలో భార్య
భర్తలు ఇరుక్కుపోయిన స్థితిని ఆయన చిత్రించారన్నారు. పత్ర సమర్పణ చేసిన సంస్కృత
విద్యాపీఠాచార్యులు డాక్టర్ డి మల్లన్న మాట్లాడుతూ సాలెగూడు నాటకం పవిత్రప్రేమకు అంతస్తులు అడ్డుకావని నిరూపించిన రచనగా
కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు డా.పి.విజయ కుమార్
మాట్లాడుతూ తిలక్ కవిత్వంలో అనుభూతి అభివ్వక్తి రెండూ నవ్యత సాధించామని
వివరించారు. మధురై కామరాజ్ విశ్వవిద్యాల య ఆచార్యులు డా.జె.వెంకటరమణ సుశీల
పెళ్ళి నాటకంలోని ఔచిత్యాన్ని తెలిపారు. సదస్సుకు సమన్యయ కర్తగా వ్యవహరించిన
డా.ఎన్. ఈశ్వర రెడ్డి మాట్లాడు తూ సమాజంలోని దయనీయతను,వ్యక్తిలోని స్వార్థాన్ని అద్భుతంగా చిత్రిం చిన
కవిగా తిలక్ ఎప్పటికీ గుర్తుండి పోతాడన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి