హెచ్ సి యూ తెలుగు శాఖ ఆచార్యులు ఆచార్య తుమ్మల రామకృష్ణ ద్రావిడ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయిన సందర్భంగా బుధవారం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ ఆధ్వర్యంలో వివిధ శాఖాధిపతులు ఘనంగా సన్మానించారు.
ఆచార్య తుమ్మల రామకృష్ణ సారధ్యంలో ద్రావిడ భాషల అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నామని వివిధ శాఖాధిపతులు వ్యాఖ్యానించారు. తనకు జరిగిన సత్కారానికి ఆచార్య తుమ్మల రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. సాహిత్యం ద్వారానే మనుషుల్నీ, దాని ద్వారానే వైస్ ఛాన్సలర్ స్థాయికి చేరుకున్నాని ఆయన వివరించారు.తెలుగు, కన్నడ, తమిళ రాష్ట్రాల సంస్కృతికి కేంద్రంగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉందని, తనవంతు అన్ని భాషలు, సంస్కృతులకు సమప్రాధాన్యాన్ని ఇస్తానని ఆయన అన్నారు. ఈ సమాజాన్నీ అర్థం చేసుకున్నానని, ఈ కార్యక్రమంలో ఆచార్య వి.కృష్ణ ( డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్), హిందీ, తెలుగు, సెంటర్ ఫర్ ఎన్ డేంజర్ లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, ఉర్దూ తదితర శాఖాధిపతులు, హెచ్ సి యూ అధ్యాపక సంఘం అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య సర్రాజు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పమ్మిపవన్ కుమార్, ఆచార్య సయ్యద్ ఫజులుల్లా, ఆచార్య భోంస్లే, ఆచార్య జంధ్యాల ప్రభాకర రావు, ఆచార్య ఆచార్య సునీత, ఆచార్య టోనీ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి