ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం మరియు మహర్షి సాత్యవతేయ విజ్ఞాన పరిషత్ వారు సంయుక్తంగా ‘‘ఆధునిక తెలుగు సాహిత్యం- తిలక్ వైశిష్ట్యం’’ పేరుతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాల అంతర్జాతీయ సదస్సు సమాపనోత్సవంలో గౌరవ అతిథిగా ఆచార్య దార్లవెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దేవరగొండ బాలగంగాధర్ తిలక్ గారి కవిత్వంలో ‘‘త్రిమూర్తులు’’ కవితలో విశ్వనాథ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీల గురించి వర్ణించారని, దాని ద్వారా తిలక్ సాహిత్య లోతులు, వారి దృక్పథాన్ని అవగాహన చేసుకోవచ్చునని అన్నారు. చాలా మంది కవితిలక్ గురించీ, స్వాతంత్ర్య ఉద్యమకారుడు తిలక్ కీ తేడాలేకుండా కూడా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు చాలాబాధ అనిపిస్తుందన్నారు. తిలక్ కవిత్వం గురించి పరిశీలన చేసేటప్పుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిసేనమేనిఫెస్టో తో తులనాత్మకంగా పరిశీలన చేయవచ్చనని అన్నారు.
సదస్సులో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి