అనేక సందర్భాలలో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి ధైర్యం నింపి ఆశావహదృక్పథం కలిగించిన గురువర్యులు ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారికి నమస్కారాలు. ఇవ్వేళ శతకంసాహిత్యం గురించి మీరు చేసిన కీలకప్రసంగం చాలా బాగుంది. కాలానుగుణంగా వదిలించుకోవాల్సినవి, విదిలించుకోవాల్సినవి ఉన్నాయని, వాటిని పునర్మూల్యాంకనం చెయ్యవలసిన అవసరాన్ని నిర్దేశించారు. ఇతరులు నొచ్చుకునేలా రచనలు చేయరాదన్నారు. ఇదే కదా పరేంగిత సారం ఎంత సూక్ష్మంగా చెప్పారు అనిపిస్తుంది. వ్యాకరణం, ఛందస్సు క్రమతని నేర్పేవే కాని సంకెళ్ళు కావని, వాటి బోధనలో జాగ్రత్తవహించాలని అన్నారు. ఈ రంగంలో పరిశ్రమిస్తున్న నాకు ఉపదేశంగా ఉంది. ఈ అంతస్సూత్రాన్ని ఎప్పుడూ పాటిస్తాను గురువు గారు. మీరు కీలకప్రసంగం చేసిన వేదికలో తరువాత పత్రసమర్పణ చేయటం భాగ్యంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. అంతేవాసి. లక్ష్మీనారాయణ🙏🙏🙏
ఆంధ్ర జ్యోతి దినపత్రిక, 24.10.2020 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి