మంచిర్యాల అగ్రికల్చర్ : రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత చరిత్ర, సాహిత్యాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయి అంతర్జాల కవి సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాలకు చెందిన దేశభక్తుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సూదిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడారు. ఠాగూర్‌పై ఐదు సాహితీ సంఘాలు కలిసి కవి సమ్మేళనా న్ని నిర్వహించినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో వేదికలపై నిర్వహించలేకపోయామని, అందుకోసం అంతర్జాలంలో ఆన్‌లైన్‌లో కవి సమ్మేళనం ఏర్పాటు చేశామని చెప్పారు. రవీంద్రుని సాహిత్యం, ఆయన రాసిన జాతీయ గీతం, రచనలపై కవులు సమ్మేళనంలో కవితల రూపంలో తెలిపారు. ఈ సమ్మేళనానికి ముఖ్యఅథితిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర్ రావ్, విశిష్ఠ అతిథిగా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ గంపా వెంకట రామయ్య, సబ్బాని లక్ష్మీనారాయణ, వైరాగ్యం ప్రభాకర్ పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి