ఈ కార్యక్రమంలో పాల్గొని నేను చదివి కవిత
తాను నడిచిన నేల
తాను ఊపిరి పీల్చిన నేల
తాను జీవించిన నేల
ఆ నేలే తానైన
తానే ఆ నేలై పరిమళించిన మహానుభావుడు
ఆ నేల కోసమే బ్రతుకంతా బ్రతికిన మహామనీషి
ఆయనే కాళన్న
ఆయన మాటలో యాస
తెలంగాణా ఆత్మగౌరవ భాష
ఆయన మాట్లాడుతుంటే
మనింట్లో వాళ్ళెవరో మాట్లాడుతున్నట్లు
ఆయన పోట్లాడు తుంటే
మన బ్రతుకుల్లో వెలుగునింపే
అయ్యలాగే అన్పిస్తాడు
కాళన్న ఆధిపత్యాన్ని నిలదీసే ఒక ధైర్యం
కాళన్న ఆంధ్రంబు రాదంటు సకిలిస్తే
అమ్మ భాష రాని వాణ్ణి చావవెందకన్న
మాతృభాషకు మహోన్నత గౌరవం!
కాళన్న మాటలో
కాళన్న బాటలో
కదిలించే నిత్య చైతన్యం.
కాళన్న నేడొక వ్యక్తికైనా దు
కాళన్న నేడొక వ్యవస్థ
అవ్యవస్థకొక నిత్య చైతన్యం గీతిక
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 26.8.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి