నిన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, చెన్నై, తమిళనాడు వారి కోరిక మేరకు తెలుగు చదువుకున్న వారికి గల ఉపాధి అవకాశాల గురించి అంతర్జాలంలో ఒక ఉపన్యాసం ఇచ్చాను.
తెలుగు శాఖ, సృజన భాషామండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ అంతర్జాల సమావేశం జరిగింది. దీనిలో సుమారు 139 సభ్యులు భాగస్వాములయ్యారు. తెలుగు ప్రత్యేకంగా చదువుకున్న వారికి, ద్వితీయ లేదా తృతీయ భాషగా చదువుకున్న వారికి, కేవలం ఆసక్తితో చదువుకున్న వారికి గల ఉపాధి అవకాశాల గురించి వివరించాను. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలలో గల వివిధ అవకాశాల గురించి వివరించాను. తెలుగు భాషా, సాహిత్యం, వ్యాకరణం, ఛందస్సు, అలంకార శాస్త్రం, సాహిత్య శాస్త్రాల్లో నిష్ణాతులైన వారికి అనేక ఉపాధి అవకాశాలు ఉన్న విషయాన్ని వివరించాను. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ ప్రత్యేకంగా పెడుతున్నాను. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.మోహనశ్రీ, ఇంటర్నల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ సెల్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి.బి.వనిత, సమావేశ కరచాలకులు శ్రీ గుగ్గిలం రమేశ్, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ పి.ఎస్.మైథిలి పాల్గొన్నారు. ప్రసంగానంతరం అంతర్జాల సమావేశంలో పాల్గొన్న సభ్యుల మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతం తెలుగు సిలబస్, పాఠ్యప్రణాళికల రూపకల్పనలో ఆంగ్లం, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అంశాలు చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దీనికి సంబంధించిన వార్తను ‘ ఈనాడు దినపత్రిక తమిళనాడు (https://m.eenadu.net/districts/mainnews/Tamil-Nadu/704/220111804) వారిలా ప్రచురించారు.
27న కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగ ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు ‘తెలుగు వారికి ఉపాధి అవకాశాలు’పై ప్రసంగించారు. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులుగా సేవలందించే వీలుందన్నారు. స్వయం కృషి ఉన్న వారు తెలుగు టైపింగు నేర్చుకుని కోర్టు వ్యవహారాలు, భూమి పత్రాలను తెలుగులోనే రూపొందిస్తున్నారని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి