"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

17 జూన్, 2020

రంగస్థలం

నాటకానికి తెరపడగానే
వాస్తవం వెలుగులో
రంగుల్ని తుడిచేసినట్లే
నవ్వులన్నీరాలిపోతాయి
ఆభరణాలన్నీ
ఒక్కొక్కటిగా తొలగించేసినట్లే
ఆ గాంభీర్యం పలికిన పలుకులన్నీ
చీకటిగదిలో ఏకాకిగా మూగబోతాయి
బయట ప్రేక్షకుల సంతోషపు కెరటాలు
లోన మనసులో కీచురాళ్ళు చేసే గాయాలు
ఆ సంఘర్షణలో విజేతలెవరో
పరాజితులెవరో నిజంగా తేల్చేదెవరు?
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 15.6.2020
( ఎం.ఎస్.ధోనీ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్యకు స్పందిస్తూ...)








కామెంట్‌లు లేవు: