ఇన్నాళ్లూ వాళ్ళు తాగలేదని చెప్పగలమా
భయం భయంగా ఆ చీకటి గుహల్లో పూడ్చుకున్న వాళ్ళ సజీవ సమాధులు
మనకెంతమందికి తెలుసు?
ఆ నిషేధిత ప్రాంతాల్లో
నిర్భయంగా సాగిన ఆ చీకటి వ్యాపారపు
కల్తీసరుకుల త్రాసులకు ఉరేసుకున్న వాళ్ళు మనకెంతమందికి తెలుసు?
అందరికీ తెలుసు కదా...
లాక్ డౌన్ కి ముందు మద్యం షాపులన్నీ
గింజలతో పొంగిపొర్లుతున్న గాదెలేకదా!
మళ్ళీ తెరిచేసరికే అవన్నీ
ఏ చిట్టెలుకల పాలయ్యాయి?
రాజప్రాసాదపు ఖజానాలో
ఒంటరిగా చిక్కిపోయిన రూపాయి
దొడ్డి దారిలో వాడి పంచన చేరి
పందికొక్కెలా ఎలా బలస్తోంది?
ఇవన్నీ ఎలాగున్నా
గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లతో పనిలేకుండా
అన్ని జోన్లలోనూ మద్యం ప్రవహిస్తే
కరోనా ప్రవాహం ఆగిపోతుందా?
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 5.5.2020
(ప్రజలు మద్యాన్ని తమకు తాముగా వద్దని మారే చైతన్యాన్ని పొందనంతవరకూ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడం తప్పదని తెలిసి...!)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి