"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

03 మే, 2020

శ్రీనివాస లీలా విలాసం!



శ్రీనివాస‌లీలా విలాసం!
స్వామీ!
 ఇంకొన్నాళ్ళపాటు నీ చిరునవ్వుల జల్లుల్లో
నన్నూ తడవనివ్వగలవా?
స్వామీ!
ఇంకొన్నాళ్ళపాటు నీ దోబూచులాటల్లో
నన్నూ ఆడుకోనివ్వగలవా?
స్వామీ!
ఇంకొన్నాళ్ళపాటు నిన్నీ భుజాల పల్లకీపై
నన్నూ మోయనివ్వగలవా?
స్వామీ!
ఇంకొన్నాళ్ళపాటు ఈ గోరుముద్దల్ని
నాకూ తినిపించే భాగ్యాన్నివ్వగలవా?
స్వామీ!
ఇంకొన్నాళ్ళపాటు నీ బుడిబుడి అడుగులకు పూల పాన్పుగా ఈయెదను
నన్నూ సమర్పించనివ్వగలవా?
స్వామీ!
నువ్వు నా మెడచుట్టూ రెండు చేతులతో
బంధించిన క్షణంలో
నీ మెడలో నన్నూ ఓ పూలదండనవ్వనివ్వగలనా!!

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 3.5.2020

కామెంట్‌లు లేవు: