"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

02 మే, 2020

ఆనందపుసాగరం మాకాసారపు మహేశ్


చెక్కచెదరని చిరునవ్వుని వెదజల్లుతూ ఉండేవాడు. ఎప్పుడూ నున్నగా దువ్వుకున్న తలను గాలిని కూడా ముట్టుకోనిచ్చేవాడుకాదు-అదెక్కడ చెరిపేస్తుందోనని భయమనుకుంటా!
సన్నగా ఉండటంతో వాడికి ఇన్సర్ట్ చాలా బాగుండేది. వాడప్పుడప్పుడూ కళ్ళజోడు తీసి పెట్టుకుంటుంటే ఆ స్టైల్ చూడ్డానికి మరింత అందంగా అనిపించేది.
వాడు చిలకముక్కని ఎగరేస్తూ మాట్లాడుతుంటే, కదిలే ఆ పెదవుల్నీ, చిన్న పిల్లాడిలా నాకళ్ళతో కనిపెట్టుకుంటుండేవాణ్ణి. అర్థమైన వాటికి నాకనులు విప్పారేవి. అర్థంకాని మాటలకు తర్వాత వచ్చే మాటలు ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని నా చెవులు వెడల్పు చేసుకొని వాడి మాటల్ని అందుకోవానుకునేవాణ్ణి. అయినా నాకర్థం కాలేదని కనిపెట్టేసేవాడేమో...మళ్ళీ ఓ చిరునవ్వుని చిలకరించేవాడు. '' గదేందిరా బాయ్..సమజ్ కాలే...నీక్కాదులే...ఆ ముచ్చటేదో నీ భాషలోనే చెప్తాలే'' అనగానే కథచెప్తానంటే ఆశగా ఎదురుచూసే పిల్లాడిలా వాడికి మరింత దగ్గరగా జరిగే వాణ్ణి. '' అదేంటంటేనండీ...ఆయ్ఁ..!'' అంటూ ఒక వేళాకోళపు చురకనంటిన చేత్తో నా మీద చెయ్యేసి, నాకేసే చూస్తూ చెప్పేవాడు.  ''ఓహో ...అదా దానర్థం..'' అనుకుంటూ గడిపిన రోజులెన్నో!

వాడెప్పుడూ నవ్వులమూటతో తిరిగేవాడు.
వాడితో ఉంటే కాలం కుళ్ళుకుంటూ ఎప్పుడెళ్ళిపోయేదో మాకెవరికీ తెలిసేది కాదు.
వాడే మా మహేశ్!
నిత్యమానందానికి ప్రతిరూపు
కాసారపు మహేశ్!।
ఆ మధ్య నాకు ఒక అపురూపమైన దృశ్యాన్ని పంపాడు. మనం పుస్తకాల్లో దాచుకున్న నెమలి కన్నుల్లా దాన్ని కాపాడుకున్నాడని దాన్ని చూడగానే నాకనిపించింది. మీకోసం ఆ ఫోటో...। -ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ 2.5.2020
( చాలా రోజుల తర్వాత  మా ఎం.ఏ., నాటి మిత్రుడి గురించి....)

కామెంట్‌లు లేవు: