క్షేత్రబీజ ధర్మం?
ఎండినగొంతు నెర్రలు
నెర్రలుగా
ఎదురు చూస్తుంది!
పరువానికొచ్చిన మేఘం - పురులువిప్పింది!
చినుకులు కురుస్తున్నాయి - అడుగు నిలవడం లేదు
జల్లులవుతున్నాయి- తియ్యని మూల్గులు
వర్షం కురుస్తోంది-రెక్కల్నిప్పిన పరవశం
వరదపొంగుతోంది- అంతా సుగంధ పరిమళం
యేరుల ప్రవాహం - కళ్ళు నాల్గు నిండు చందమామలు
తుఫాను-వనమంతా పరుచుకున్ప నెమలికన్నులు
ఎదురు చూస్తుంది!
పరువానికొచ్చిన మేఘం - పురులువిప్పింది!
చినుకులు కురుస్తున్నాయి - అడుగు నిలవడం లేదు
జల్లులవుతున్నాయి- తియ్యని మూల్గులు
వర్షం కురుస్తోంది-రెక్కల్నిప్పిన పరవశం
వరదపొంగుతోంది- అంతా సుగంధ పరిమళం
యేరుల ప్రవాహం - కళ్ళు నాల్గు నిండు చందమామలు
తుఫాను-వనమంతా పరుచుకున్ప నెమలికన్నులు
ముసురు-కారుతున్న వేంటవి?
గొంతేమిటింకా అలానే పిడచకట్టుకుపోతోంది!
ఈ నేలేంటింకా ఒక్కనెరకూడా మూతబడ్డంలేదు!
ఈ బీజమేంటి ఎంతకీ మొలకెత్తడంలేదు!
ఇక్కడ కురవాల్సిన మేఘం ఎక్కడికి పోయింది?
ఇక్కడ తడవాల్సిన నేల ఎక్కడ దాగుంది?
-దార్ల వెంకటేశ్వరరావు
9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి