8 ఏప్రిల్
2020
రెండు
రోజుల నుండి ఎందుకో నాకు రకరకాల కలలు వస్తున్నాయి.
అవి మనసుని ఛిద్రం చేస్తున్నాయి.
నేను
ఎక్కడికో వెళ్లి పోతున్నట్లు,
వెళ్ళ వలసిన చోటు కి నాతో పట్టుకెళ్ళవలసినవేవో
నేనుపట్టికెళ్ళలేక
పోతున్నట్లు కలలు వస్తున్నాయి.
ఎక్కడికి
వెళుతున్నానో తెలీదు.
చుట్టూ
చీకటి.
తెల్లవారిన
తర్వాత వాటిని రాసుకుందాంమనుకుంటే అవి సరిగ్గా గుర్తుండట్లేదు.
గుర్తున్నంత
వరకూ ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను.
1
నేను
ఇంట్లో అందర్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళి పోతున్నాను.
ఎందుకొదిలేసి
వెళ్ళిపోతున్నానో నాకే తెలియదు.
వెళ్ళిపోతున్నానంతే.
వెళ్ళిపోతున్నానంతే.
నేను సరిగ్గా బట్టలు కూడా ధరించలేదు. కానీ, కొన్ని బట్టల్ని సర్దుకున్నాను.
కానీ వాటిని నాకు కూడా తెచ్చుకోలేకపోతున్నాను.
ఇంకా కొన్ని కొత్తబట్టలు,
ప్యాకింగ్ కూడా ఇప్పని కొత్తబట్టలు
నాతో పాటు తెచ్చుకోవాలనుకున్న కొత్తబట్టలు
నా వెనకాలే అలా పడిపోతున్నాయి.
ప్యాకింగ్ కూడా ఇప్పని కొత్తబట్టలు
నాతో పాటు తెచ్చుకోవాలనుకున్న కొత్తబట్టలు
నా వెనకాలే అలా పడిపోతున్నాయి.
కానీ వాటిని తీసుకోలేకపోతున్నాను.
నా చుట్టూ ఎవరూ రావట్లేదు.
వాటిని
తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు చేతకావట్లేదు.
హడావిడిగా
వాటిని తీసుకోవాలనుకుంటున్నాను.
గబగబా
ఎక్కడికో వెళ్లిపోవాలనుకుంటున్నాను.
ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియట్లేదు.
ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియట్లేదు.
చుట్లూ
చీకటి
విశాలమైన
రోడ్లు... జాతీయరహదారుల్లా ఉన్నాయి.
కానీ, చీకటి.
ఎటుచూసినా ఒక్కటైటూ కనిపించడంలేదు.
కానీ, చీకటి.
ఎటుచూసినా ఒక్కటైటూ కనిపించడంలేదు.
నడవడం
ఎందుకు?
ఏదైనాబస్సు
ఎక్కి వెళ్లొచ్చు కదా అనుకున్నాను.
కానీ ఆ సమయంలో ఒక్క బస్సూ రావడంలేదు.
సర్లే, నడిచివెడదామనుకున్నాను,
కొంతదూరం వెళ్లాను.
ఎటు చూసినా జనం కనబడ్డంలేదు.
రోడ్డంతా ఖాళీ...
సడన్ గా గుర్తొచ్చింది ఆరోజు అమావాస్య అని.
రకరకాల
కథలు గుర్తుకొస్తున్నాయి.
మనుష్యుల్ని
చంపేవాళ్ళు తిరుగుతుంటారట
మనుష్యుల
అవయవాల కోసం ఒంటరిగా ఉన్నవాళ్ళను తీసుకుపోతారట
ఒంటరిగా
దొరికితే దెయ్యాలు పీక్కుతింటాయట
ఎటునుండి
ఎవరొస్తారోనని మనసంతా కమ్ముకున్న భయం .
వేగంగా అటూ ఇటూ అన్నివైపులా చూస్తున్నాను.
చెమట పెట్టేస్తుంది.
భయం పెరిగిపోతుంది.
భయం పెరిగిపోతుంది.
ఇంత అర్ధరాత్రి సమయంలో నేను ఎక్కడికి వెళ్లాలి ?
పోనీ వెనక్కి వెళ్లి ఏదైనా బస్ స్టేషన్లో బస్సు
దొరుకుతుందేమో చూద్దామనుకున్నాను
కానీ మళ్ళీ
అంత దూరం నడవగలనా అనిపించింది.
నడవలేక పోతున్నాను.
సరే ఇక్కడ ఎక్కడైనా బస్టాప్ కనిపిస్తుందేమో
చూద్దామని ఆగాను.
కానీ ఎక్కడా కనిపించట్లేదు
బస్ స్టాప్ కనిపించట్లేదు.
మనిషి
కనిపించడంలేదు
తాగడానికి
నీరు దొరకడంలేదు
అలిసిపోయాను
ముందుకు నడవలేక పోతున్నాను
వెనక్కి నడవలేక పోతున్నాను
ఆకలేస్తుంది
ఏమీ లేవు
నా దగ్గరా లేవు
నా దరిదాపుల్లోనూ లేవు
ఇంట్లో ఎన్నుండేవి?
దాహం వేస్తుంది
నా దగ్గరా లేవు
నా దరిదాపుల్లోనూ లేవు
ఇంట్లో ఎన్నుండేవి?
దాహం వేస్తుంది
నీళ్ళెక్కడా
లేవు
చేసేదేముందిలే
అనుకుని అక్కడే ఎక్కడైనా పడుకుందామనుకున్నాను.
ఆ రోడ్డు మీద పడుకుందామనుకున్నాను.
అమ్మో ఏ
వెహికలో నామీదనుంచి వెళ్ళిపోతే...
భయమేసింది
భయమేసింది
రోడ్డు
పక్కనే పడుకున్నాను.కానీ నాలో చిన్నగా భయం
మొదలైంది
ఈ అర్ధరాత్రి ఎవరైనా నన్ను కొడతారేమో.
ఎవరైనా నన్ను తీసుకు పోతారేమో
నన్ను
దొంగంటారేమో
ఇక్కడ ఎందుకు పడుకున్నావని అడుగుతారేమో
వాళ్ళకే మి
చెప్పాలి?
ఒకటే భయం
ఏదైనా జంతువు వస్తుందేమో
నా
దగ్గరేమైనా ఉన్నాయని దొంగలు చంపేస్తారేమో
నా భార్య
ఏమైపోవాలి.
నా
పిల్లోడేమైపోతాడు
నా
గురించి నా కుటుంబం ఎక్కడ వెతుకుందో
ఒకటే భయం
ఒక్కసారిగా మెలుకువ వచ్చేసింది.
2
మరలా పడుకున్నాను.
నిద్రపోవాలనుకున్నాను.
ఆలోచిస్తూ నిద్ర పోయాను.
ఎప్పుడు నిద్ర పట్టేసిందో పట్టేసింది.
ఇంకో కల
మరలా నేను ఎక్కడకో కొన్ని బట్టలు సర్దుకుని
మళ్ళీ వెళ్ళిపో తున్నాను.
నేను సరిగ్గా బట్టలు కూడా కట్టుకోలేదు.
మరలా నేను ఎక్కడకో కొన్ని బట్టలు సర్దుకుని
మళ్ళీ వెళ్ళిపో తున్నాను.
నేను సరిగ్గా బట్టలు కూడా కట్టుకోలేదు.
అలా వెళ్ళి పోతూ దారిలో ఎక్కడో ఒకచోట పడిపోయాను.
అక్కడో గుంట
బురదగుంట...
దానిలో కొన్ని నీళ్ళున్నాయి.
దాన్లో ఒకటి, దాని చుట్టూ ఇంకొన్ని
నా బట్టలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.
అక్కడ మా నాన్న సైకిల్ మీద నిలబడ్డాడు
నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు.
ఆశ్చర్యపోయాను.
ఈ సమయంలో నానెలా వచ్చాడేంటని డౌటొచ్చింది.
ఏంటోనాకు అర్థం కాలేదు .
బురదగుంట...
దానిలో కొన్ని నీళ్ళున్నాయి.
దాన్లో ఒకటి, దాని చుట్టూ ఇంకొన్ని
నా బట్టలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.
అక్కడ మా నాన్న సైకిల్ మీద నిలబడ్డాడు
నాతో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు.
ఆశ్చర్యపోయాను.
ఈ సమయంలో నానెలా వచ్చాడేంటని డౌటొచ్చింది.
ఏంటోనాకు అర్థం కాలేదు .
నన్ను చూసి నవ్వుతున్నాడు.
చేయందిస్తున్నాడు.
కానీ, నాకు ఆ చేయి తగలడం లేదు.
ఆ చేయినందుకోలేకపోతున్నాను.
మనసంతా ఏదో ఆందోళన
మనసంతా ఏదో ఆందోళన
నా భార్య ఏదో అంటుంది
నా కొడుకెందుకో ఏడున్నాడు.
వాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.
ఆమె కూడా వాడితో పాటు ఏడుస్తుంది. లాలిస్తోంది.
కాసేపు అదికూడా
కలనుకున్నాను.
ఆ కలను నుండి బయటకు రాలేకపోయాను.
కలనుకున్నాను.
ఆ కలను నుండి బయటకు రాలేకపోయాను.
గోడకున్న గడియారం చూశాను.
సమయం 3.15 నిమిషాలైంది.
ఈ టైములో వాళ్ళెప్పుడూ లేవలేదు.
నిజంగానే...వాళ్ళు లేచారు.
నిజంగానే...వాళ్ళు లేచారు.
వాళ్ళను చూసి ఆందోళనగా అనిపించింది.
ఎందుకేస్తున్నాడని అడిగాను.
ఎందుకో తెలీదు. అమాంతగా ఏడున్నాడంది.
నా ఒళ్ళోకి తీసుకున్నాను.
నన్ను పదేపదే చూస్తున్నాడు
నా కళ్ళల్లోకి చూస్తున్నాడు
నా ముఖంలోకి చూస్తున్నాడు.
ఏడుపు ఆగట్లేదు.
ఎందుకేడుస్తున్నాడు? నిన్న కోప్పడ్డాను కదా... అందుకేనేమో
క్యాడ్ బర్రీ చాక్లెట్స్ ఇచ్చినా, మళ్ళీ మళ్ళీ కావాలంటే
కోప్పడ్డాను.
వాడికి ఆ కోపమే ఇంకా గుర్తొస్తుందా?
ఇంకెప్పుడూ కోప్పడకూడనుకున్నాను.
రెండుచేతులూ చాచాను. ఒక్కసారిగా ఒడిలో వాలిపోయాడు. ఏడుపాగడం
లేదు.
ఎందుకేడుస్తున్నాడో...
నిన్నటి నుండి వాడు బాత్ రూమ్ కి వెళ్ళలేదు.
వాడి పొట్ట చూశాను. గట్టిగా ఉంది. కాసేపు నిమిరాను
ఒడిలో గువ్వలా వాలిపోయాడు. ఏడుపాగడంలేదు.
నాకేమి చేయాలో తోచడం లేదు.
ఆమెకూడా ఏడుస్తుంది. ఓదారుస్తుంది
గ్రైఫ్ వాటర్ కొద్దిగా పట్టమన్నాను.
గబగబా పట్టుకొచ్చి పెట్టింది.
వాడు మొదట తాగలేదు. తర్వాత తాగాడు
ఏడుపాపడం లేదు.
ఫోను తీసుకొని పాటలు పెట్టాను.
వాటిని చూస్తున్నాడు. కానీ, ఏడుపాగడం లేదు
కొంతసేపటి తర్వాత కొంత ఏడుపాపాడు.
వాటి పొట్ట గట్టిగా ఉందనిపించింది. దాన్ని కాసేపలాగే
నిమిరాను
ఆమె అమృతాంజన్ బేబీరబ్ పొట్టమీద రాసింది.
మెల్లగా నిమురుతూ ఒళ్లోకి తీసుకుంది.
పాలిమ్మాను. అంతకుముందే తాగాడంది.
ఒళ్ళో వేసుకొని ఇంట్లో అటూ ఇటూ తిప్పుతూ
ఆందోళన పడుతూ పాడుతూనే ఉంది.
కాపేపటికి నిద్రపోయాడు.
నా కలలకీ,
పిల్లాడు ఏడ్వడానికీ ఏమైనా సంబంధం ఉందా?
ఏదో అలా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా?
ఏమో
నాకెందుకో నిన్నరాత్రి వచ్చిన కలను రాసే ప్రయత్నం
చేయాలానిపించింది.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు. 8.4.2020. ఉదయం 9. 30 నిమిషాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి