జీవన చౌరస్తా!
గమ్యంచేరుకుంటున్నాననుకున్నప్పుడల్లా
జీవితాల్నివడబోసివాళ్ళో
జీవితాల్ని భయపెట్టేవాళ్ళో
అనుభవాల అడుగుల్నో
అడుగునపడినమడుగుల్నోదాటుకొనిపొమ్మంటారు
నడుస్తున్నది తార్రోడ్డో, సిమెంటు రోడ్డులా కనిపించే ఊబగుంటో
తేల్చుకోలేక
ఊగిసలాటలోపడిపోతుంటాను
గమ్యమింత అగమ్యమవ్వడానికి
స్వయంకృతాపరాధమా?
స్వయంనిర్ణయరాహిత్యమా?
జీవిత గమ్యం...
రహదారిపై
నడిచినంతతేలిక్కాదు-కొత్తదారి కనిపెట్టడం
రహదారిపై కారు నడిపినంత
సరదాకాదు-కొత్తగా కారునడపడం
రహదారిపై పోయినంత
సుభంకాదు-చౌరస్తాలో చేరాల్సినవైపు మరలడం
జీవితం బొంగరంలా తిరగడానికి
రన్నింగ్ ర్యాక్కాదు !
సంఘర్షణ... నిత్య సంఘర్షణ...
సత్యాన్వేషణ
జీవితం
కొత్త సృష్టికోసం నిత్యంపడే
తియ్యని పురిటినొప్పు
జీవితం సొంత ఉనికి కోసం చీకటి
మెగుల్ని విడదీసి
చూడానుకునే నిత్యపయనం!
ఒక్కసారి చూడా నక్షత్రాన్ని!
ఒక్కసారి చూడా కుక్కపిల్ల
విశ్వాసాన్ని!
ఒక్కసారి గుండెకు హత్తుకో ఆ
రాలిన పుష్పాన్ని!
ఒక్కక్షణం తలెత్తిచూడా
సూర్యుణ్ణి!
అమ్మదిద్దించిన అక్షరం కొత్త
ఊపిరి పోస్తుంది!
ఒక్కకన్నుకి మిగతాకన్నూ
ఒక్కచేతికి రెండోచేతినీ
జతకలుపు కొత్తలోకమేదో కనిపిస్తుంది!
-దార్ల వెంకటేశ్వరరావు
9182685321
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి