"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

25 ఏప్రిల్, 2020

‘‘సిగ్గేమాయె’’


‘‘సిగ్గేమాయె’’


25 ఏప్రిల్ 2020
సమయం: ఉదయం 4.15 నిమిషాలు
.........
రోజూలాగే, ఆ రోజు కూడా నేను యూనివర్సిటీకి వెళ్ళాను.
ఒక బ్యాగు, అందులో కొన్ని పుస్తకాలు, లాప్ టాప్, కొన్ని పెన్నులు... తదితరాలన్నీ పెట్టుకున్నాను.
కారులో బ్యాగు పెట్టుకున్నాను.
క్యాంపస్ లో ఏదో పనిమీద మరో డిపార్టుమెంటుకి వెళ్తున్నాను.
కడుపులో ఏదో గడబిడగా అనిపించింది.
సడన్ గా రోడ్డు పక్కనే కారు ఆపేశాను.
రోడ్డుకి ఒకవైపు లేడీస్ హాస్టల్, మరోవైపు స్టూడెంట్స్ క్యాంటీన్... జనం బాగానే తిరుగుతున్నారు
నా బ్యాగు తీసుకొని బయటకొచ్చాను. నా ఫోను దానిలో వేసి, రోడ్డుమీద పెట్టేశాను.
నా ఫ్యాంటు విప్పేసి, ఆ రోడ్డు పక్కనే అర్జెంటుగా వస్తుంటేకూర్చున్నాను.
ఒక చిన్న చెట్టేదో ఉంటే దానిపక్కనేకూర్చున్నాను. కానీ నేను అందరికీ కనిపిస్తున్నాను. నాకూ అందరూ కనిపిస్తున్నారు.
కనీసం నీళ్ళు కూడా తెచ్చుకోలేదు.
కొంతమంది నన్ను చూసి కూడా ఏమనుకోకుండా వెళ్ళిపోతున్నారు.
మరికొంతమంది నన్నసలు పట్టించుకోవడం లేదు.
ఈ లోగా ఒక కారు నా కారుకి దగ్గరగా వచ్చి ఆగింది.
అందులో నుండి నాకు బాగా తెలిసిన ఒక అసిస్టెంట్ ఫ్రొఫెసర్ దిగాడు. నన్ను చూస్తూ, నా వైపే వస్తున్నాడు.
‘అందరూ తిరిగే రోడ్డు పక్కనిలా కూర్చోవడానికి సిగ్గులేదా ?’ అని అడుగుతాడనుకున్నాను.
అతనలా వస్తుంటే, సిగ్గు, ఒకింత భయం, ఒకింత అవమానంగా అనిపిస్తోంది.
క్యాంపస్ లో జాయిన్ అయిన కొత్తలో మెయిన్ రోడ్డు పక్కన నిలబడి యూరినల్ కి వెళ్తుంటే, ఒకామె బహుశా యూనివర్సిటీ ఫ్యాకల్టీ అనుకుంటాను. నా దగ్గరకొచ్చి ‘‘ పబ్లిక్ ప్లేసులో ఇలా యూరిన్ చెయ్యకూడదు. ఆపెయ్’’ అని ఆపిందాకా ఊరోకూకుండా తిట్టేసింది. నా పక్కనున్న నా ఫ్రెండ్స్ ని కూడా అలాగే తిట్టేసింది.
ఆమె మా దగ్గరకొచ్చి మరీ అక్కడ నుండి లేచి వెళ్లేవరకూ తిట్టింది. మా జిప్పులు పెట్టుకునేవరకూ మా దగ్గరే ఉంటే మాకు సిగ్గేసింది.
ఆ సంఘటన గుర్తుకొస్తుంది.
ఇప్పుడిలా రోడ్డుపక్కనకూర్చున్నాను. అతనూ, నేనూ ఈ యూనివర్సిటీలో కలిసే చదువుకున్నాం. అతను పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు. అప్పుడప్పుడూ  అతని రచనలు పత్రికల్లో కూడా వస్తుంటాయి. క్యాంపస్ లో విద్యార్థి ఉద్యమాలతో సంబంధాలున్నాయి. ఈ మధ్యనే క్యాంపస్ లో అసిస్టెంటు ప్రొఫెసర్ గా చేరాడు. అప్పుడప్పుడూ టీ.వీ. చర్చల్లో పాల్గొంటాడు. ఇప్పుడు నా దగ్గరకొస్తున్నాడు. నాకేమి క్లాసు తీసుకుంటాడో... నా ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయి.  అతడు నా దగ్గర్లోనే పెట్టుకున్న నా బ్యాగు దగ్గరకు సమీపిస్తుండగా, నా ఎదురుగా ఎం.ఏ.తెలుగు సెకండియర్ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు వచ్చికూర్చున్నారు.
 వాళ్ళూ నాలాగే, అదే పని చేస్తున్నారు. నన్ను పలకరించారు. నేనూ వాళ్లను పలకరించాను. ఏమీ పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు.
జనం కూడా అటూ, ఇటూ వెళుతున్నారు. వస్తున్నారు.
మమ్మల్నెవరూ పట్టించుకోవడం లేదు.
కానీ, దూరం నుండి ఒక స్టూడెంట్ మాత్రం మమ్మల్నే గమనిస్తున్నట్లనిపించింది.
నా దగ్గరకొచ్చి, నన్నేదే తిడతాడనుకున్న నా మిత్రుడు, నా బ్యాగు దగ్గరకొచ్చి, నా బ్యాగు తీశాడు. దాన్ని వెతికాడు. దానిలో పెట్టిన నా స్మార్ట్ ఫోను తీసుకున్నాడు. బ్యాగ్ అక్కేడ పడేశాడు. ఫోను పట్టుకొని వెళ్ళిపోతున్నాడు.
ఇదంతా గమనిస్తున్నాను.
కానీ, మరో వైపు ఈ ఇద్దరమ్మాయిలూ  ఏదో అడుగుతున్నారు. నేనేదో సమాధానం చెప్తున్నాను.
వీళ్ళు కూడా నీళ్లు తెచ్చుకోలేదు. కానీ, వీళ్ళిద్దరూ లేస్తున్న సమయానికి ఆ దూరంగా మమ్మల్నే గమనిస్తున్న ఆ స్టూడెంట్ రెండు బిసలరీ బాటిల్స్ కొనుక్కొచ్చి, వాళ్ళకిచ్చి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ వాటిని ఉపయోగించుకున్నారు.
వాళ్ళూ వెళ్ళిపోయారు. కానీ, మళ్ళీ వెంటనే వచ్చారు. ఒక బకెట్ నీళ్ళు తెచ్చి నాదగ్గర పెట్టి వెళ్ళిపోయారు.
అమ్మయ్య! పెద్ద సమస్య తీరిపోయిందనుకుంటూ, వాటితో నేను శుభ్రం చేసుకుని బయటపడ్డాను.
నా బ్యాగు దగ్గరకొచ్చి, నా ఫ్యాంటు వేసుకుంటుంటే, అటువైపుగా మా డిపార్ట్మెంట్ కొలీగ్ వస్తూ,‘‘ వెనకాల ఇన్సర్ట్ సరిగ్గా చేసుకో’’... అంటూ, ఆమె నాకు తెలిసిన ఒక సైకాలజీ ఫ్రొఫెసర్ తో పాటు మాట్లాడుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది.
గబగబా నా బ్యాగు నుండి నా ఫోను తీసుకెళ్ళిన నా అసిస్టెంట్ ఫ్రొఫెసర్- మిత్రుడి దగ్గరకు పరుగెట్టికెళ్లాను. అప్పటికే అతడి దగ్గర ఖరీదైన మూడో, నాలుగో మొబైల్ ఫోన్సు ఉన్నాయి.
‘‘ నా ఫోనెందుకు తీశావు’’ అనడిగాను.
‘‘సరదాగా తియ్యలేదులే, కొట్టేద్దామనే తీసాను. కానీ, నువ్వు చూసేశావు’’ అన్నాడు.
అతని మాటల్లో తప్పు చేస్తున్నానే ఫీలింగ్ కనిపించలేదు.
‘‘నువ్విలాంటివాడివని నేననుకోలేదు ’’ అని, ‘‘ వీటిని ఏమి చేద్దామనుకుంటున్నావ్ ’’ అని అడిగాను.
‘‘ ఏముంది, ఇరవైవేల ఫోను రెండువేలిస్తే చాలంటే ఎవ్వరైనా తీసుకుంటారు. ఆ పనే చేస్తాను.’’ ఎంతో ఘరానాగా సమాధానం చెప్పాడు.
మంచి గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నాడు. జీతం కూడా బాగానే వస్తుంది. పేరు ప్రఖ్యాతులున్నాయి. కానీ, ఎందుకిలా చేస్తున్నాడనిపించింది. ఆ విషయాన్నే అడిగాను.
‘‘నాకు ఆ బ్యాగు గాళ్లంటే చిరాకు. వాళ్ళకు మరింత చిరాకు కలిగించాలనేదే నా చిరకాల వాంఛ’’ అని స్థిర నిర్ణయంగా చెప్పాడు.
‘‘ బ్యాగు గాళ్లంటే...?’’
‘‘ ప్రొఫెసర్స్... పెద్ద ఫోజులు కొడుతుంటారు కదా ... వాళ్ళే’’
‘‘వాళ్ళంటే నీకెందుకంత కోపం’’
‘‘ తమని మించిన వాళ్ళు లేరనుకుంటారు. అసిస్టెంటు ఫ్రొఫెసర్స్ ని తక్కువగా, హేళనగా చూస్తారు.’’
‘‘ నేను నీతో ఎప్పుడైనా అలా ప్రవర్తించానా?’’
‘‘లేదు...కానీ, నాకు ఆ జాతినంతా ఒకేలా ట్రీట్ చెయ్యాలనిపిస్తుంది. నువ్వూ ఆ జాతివాడివే, పైగా మనం చదువుకొనేటప్పుడు నువ్వు నా జూనియర్..... కానీ, ఇప్పుడు నాకంటే ముందే ప్రొఫెసర్ అయ్యావు. అదే కాదు గానీ, మరలా కొంతమందికి రిలాక్సేషన్ ఇవ్వడం నాకిష్టం లేదు’’
నాకేమనాలో అర్థం కాలేదు.
‘‘సర్లే గానీ, నా ఫోనేద’’ని అతని చేతుల్లో ఉన్న ఫోన్లలో నా ఫోనుని గుర్తుపట్టి తీసుకున్నాను. కానీ, నా ఫోనులో సిమ్ లేదు. అడిగితే చెప్పాడు ‘‘ నేను ఫోను కొట్టేసిన వెంటనే చేసే పనులు రెండు. ఒకటి సిమ్ తీసెయ్యడం, రెండోది ఫోను స్విచ్చాఫ్ చెయ్యడం’’
‘‘నువ్వెంతి ఎలా మాయ చెయ్యాలనుకున్నా, దానిలో జిపియస్ నిన్ను పట్టిస్తుందిలే’’ అని ఏదో చెప్పబోతుండగా
నా ఫోను రింగయ్యింది. నాకు మెలకువ వచ్చేసింది.
-        ----ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 25.04.2020










కామెంట్‌లు లేవు: