మా ఇష్టాయిష్టాలతో పన్లేకుండానే
మా ప్రతి ఇల్లునీ
నీ రియాలిటీ షో కి ఒక
వేదిక చేసుకున్నావు
నువ్వెన్నాళ్ళిలా ఆటలాడిస్తావో
మాకే తెలియనంత కాలం
మాకు మేమే విధించుకోవాల్సిన
స్వీయ నిర్భంధ ఆనందోత్సవమిది!
నువ్వెన్నాళ్ళిలా ఆటలాడిస్తావో
మాకే తెలియనంత కాలం
మాకు మేమే విధించుకోవాల్సిన
స్వీయ నిర్భంధ ఆనందోత్సవమిది!
నీకు తెలుసో లేదో పగలు రాత్రినీ, రాత్రి పగలునీ
ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళకనుకూలంగా
మా జీవ గడియారాలు దిశలు మార్చుకుంటున్నాయి
నీ రియాలిటీ షోలో
ఇల్లు ఇల్లంతా ఒక్కసారిగా పుస్తక స్వర్గమవుతుంది
ఇల్లు ఇల్లంతా స్మార్ట్ ఫోన్ చుట్టమవుతుంది
ఇల్లు ఇల్లంతా పనుల్ని పంచుకొని మెరిసిపోతుంది
ఇల్లు ఇల్లంతా స్మార్ట్ ఫోన్ చుట్టమవుతుంది
ఇల్లు ఇల్లంతా పనుల్ని పంచుకొని మెరిసిపోతుంది
ఇల్లు ఇల్లంతా తెలియని ఆనందమేదో గంతులేస్తుంది
ఇల్లు ఇల్లంతా తెలియని ఒక విషాదమేదో తాండవిస్తుంది
ఇంతలో టి.వి. తెరపైకి
మాకందరికీ తెలిసిన పెద్దాయన ఓ బిగ్ బాస్ లా వస్తాడు
కొన్నాళ్ళు దాకా సరిపోయే ఒక టాస్క్ నిచ్చి వెళ్ళిపోతాడు
ఇల్లు ఇల్లంతా తెలియని ఒక విషాదమేదో తాండవిస్తుంది
ఇంతలో టి.వి. తెరపైకి
మాకందరికీ తెలిసిన పెద్దాయన ఓ బిగ్ బాస్ లా వస్తాడు
కొన్నాళ్ళు దాకా సరిపోయే ఒక టాస్క్ నిచ్చి వెళ్ళిపోతాడు
అంతే...దాన్ని ప్రశంసిస్తూనో, పరిహసిస్తూనో
భావజాలాలం బాకాలు
భావజాలాలం బాకాలు
శాస్త్రీయవిశ్లేషణలు
డేటా అయ్యేదాకా సోషల్ మీడియా
డోకా లేకుండా మునివేళ్ళతో మాట్లాడుకుంటాం
డోకా లేకుండా మునివేళ్ళతో మాట్లాడుకుంటాం
తెచ్చుకున్న సరుకులైపోయాయని
సూపర్ మార్కెట్ ని తెమ్మంటూ
‘హోమ్ మినిస్టర్' మరో బిగ్
బాస్ అవతారం
యుద్ధానికెళ్ళుతున్న సైనికుడిలా
మూతికి మాస్క్, చేతులకు గ్లౌసులూ
వెహికిల్ కి తగిలించుకున్న పర్మిట్లతో
భయం భయంగా వీధుల్లో పరుగులు
భౌతిక దూరం పాటిస్తూ చేతులకు శానిటైజర్ పట్టిస్తూ
కోటి ఆశలతో కొనుక్కుందామని లోనికెళ్తే
దొరికినవి దొరికినట్లే పట్టుకుపోయిన దొంగల్లా
కిరాణా కొట్టుల్నీ, సూపర్ మార్కెట్లనీ లూటీ చేసిన ఖాళీలు!
ఆఫీసు బిగ్ బాస్
‘మర్కటంలా ఇంట్లో గంతులెయ్యడంకాదు
వర్క్ టు హోమ్ టాస్క్ స్టాటస్ చెప్ప’మంటాడు
‘మర్కటంలా ఇంట్లో గంతులెయ్యడంకాదు
వర్క్ టు హోమ్ టాస్క్ స్టాటస్ చెప్ప’మంటాడు
టీవీల్లో, పత్రికల్లో, సోషల్ మీడియాల్లో...
సినీనటులు తొలిసారిగా నటనను వదిలేసి
జీవితాన్ని నడిపించడమెలాగో సందేశమవుతారు
ఎంతకాలమీ రియాలిటీషో?
ఎంతకీ పూర్తికాని ఈ టాస్క్ లకు ముగింపెప్పుడు?
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
సెంట్రల్
యూనివర్సిటి, హైదరాబాదు. 8.4.2020
Mobile:
9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి