నువ్వు
నా చీకటిని పారద్రోలిన సూర్యుడవు
నువ్వు
నా బానిసత్వాన్ని ఓడించిన యోధుడవు
నువ్వు
నా అవమానపు సంకెళ్లు తొలగించిన రాజ్యాంగానివి
నువ్వు
నా మూతికివేలాడే ముంతను తొలగించిన
నిలువెత్తు ఆత్మగౌరవానివి!
నువ్వే లేకుంటే
నన్నింకా మనుస్మృతి మంటల్లో కాల్చుకుతినేవారేమో
నువ్వే లేకుంటే
ఆ మతమౌడ్యం గోతిలోనే పరుగెత్తమనేవాళ్ళేమో
నువ్వే లేకుంటే
ఆదిమానవుడిలా నన్నలాగే
సంచరించమనేవాళ్ళేమో
అందుకే నువ్వే నేనై
నేనే నువ్వై ముందుకెళుతూ ...
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 14.04.2020
నా చీకటిని పారద్రోలిన సూర్యుడవు
నువ్వు
నా బానిసత్వాన్ని ఓడించిన యోధుడవు
నువ్వు
నా అవమానపు సంకెళ్లు తొలగించిన రాజ్యాంగానివి
నువ్వు
నా మూతికివేలాడే ముంతను తొలగించిన
నిలువెత్తు ఆత్మగౌరవానివి!
నువ్వే లేకుంటే
నన్నింకా మనుస్మృతి మంటల్లో కాల్చుకుతినేవారేమో
నువ్వే లేకుంటే
ఆ మతమౌడ్యం గోతిలోనే పరుగెత్తమనేవాళ్ళేమో
నువ్వే లేకుంటే
ఆదిమానవుడిలా నన్నలాగే
సంచరించమనేవాళ్ళేమో
అందుకే నువ్వే నేనై
నేనే నువ్వై ముందుకెళుతూ ...
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 14.04.2020
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి