వేలాడుతున్న
కత్తి!
నీ కళ్ళకొక భయం పొరనతికించి
నిన్ను నిర్భయంగా వీక్షించమంటారు
నీ తలమీదొక కత్తిని వ్రేలాడదీసి
నిన్ను ప్రశాంతంగా కూర్చోమంటారు
నీ కాళ్ళకు సంకెళ్ళు వేసి
నిన్ను స్వేచ్ఛగా తిరగమంటారు
నీ కంచంలో పిండాలు పెట్టి
నిన్ను రుచులనాస్వాదించమంటారు
నిన్ను నిర్భయంగా వీక్షించమంటారు
నీ తలమీదొక కత్తిని వ్రేలాడదీసి
నిన్ను ప్రశాంతంగా కూర్చోమంటారు
నీ కాళ్ళకు సంకెళ్ళు వేసి
నిన్ను స్వేచ్ఛగా తిరగమంటారు
నీ కంచంలో పిండాలు పెట్టి
నిన్ను రుచులనాస్వాదించమంటారు
కదిలే ప్రతిమబ్బూ
నీమనసునెలా సల్లబరుస్తుంది?
అలా కురిసిన ప్రతిచినుకూ
నీజీవితాన్నెలా సశ్యశ్యామలం చేస్తుంది?
ధైర్యం చెప్పీ
అధైర్య పరచడమే ఆ విజయరహస్యం
ఇచ్చీ ఇవ్వకపోవడమే
రాజ్యలక్ష్మి గడుసుతనం!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఇచ్చీ ఇవ్వకపోవడమే
రాజ్యలక్ష్మి గడుసుతనం!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
21.12.2018
( ఈ కవితను
ఎడిట్ చేసి సాహితీ సిరికోన (అంతర్జాల పత్రిక,ఫిబ్రవరి 2020)లో ప్రచురించారు.
పూర్తికవితను ఇక్కడ ఇస్తున్నాను.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి