"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

11 ఏప్రిల్, 2020

ఇప్పటికైనా నన్నేడ్వనివ్వండి!


నాకొక్కరోజుకి
మీరు నాకు ప్రాణవాయువునివ్వాలంటే
ఐదు వందల యూరోలవుతుందన్నారు
ఆ మెుత్తాన్నివ్వగలను కానీ
నా ప్రాణవాయువుకి గంటలకొద్దీ విలువకడుతుంటే
నాకేదో గుర్తొస్తోంది
తొంబైమూడేళ్ళపాటు
నేనొక్క పైసా చెల్లించకపోయినా
నాకు నిత్యం
స్వచ్ఛమైన ప్రాణవాయువు నిచ్చిన
దేవుణ్ణి ఇప్పటికైనా
దీనివల్ల, దీనివల్లనే
గుర్తుచేసుకుంటున్నందుకు
కాసేపు నన్నేడ్వనివ్వండి
ప్రకృతిని ఆకృతిగా చేసుకుని
నేనడగకపోయినా అమ్మలా
నాకేమి కావాలో నాకన్నీ ఇచ్చిన
ఆ దేవుణ్ణి ఒక్కనాడైనా తలచుకోలేనందుకు
నన్నిప్పటికైనా ఏడ్వనీయండి
నా కన్నీళ్ళింకిపోయేదాకా నన్నేడ్వనివ్వండి!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 11.4.2020
(కరోనాకి గురైన ఒక వృద్ధుని యధార్థ స్పందనకు స్వేచ్ఛానుసృజన)

కామెంట్‌లు లేవు: