'సంభవామి యుగే యుగే!'
ఇప్పుడే బయలు దేరాలి
నవ్య సులోచనాలు ధరించి
నవ్య భాష్యాల్ని చదవాలి
ఇప్పుడే బయలుదేరాలి
నవ్యపాదుకల్ని ధరించి
నవ్య మార్గాల్ని అన్వేషించాలి
ఇప్పుడే బయలుదేరాలి
శంబూకుడి శిరసు తెగిపడిన స్థలాన్ని
పవిత్రంగా ముద్దాడాలి!
ఇప్పుడే బయలుదేరాలి
ఏకలవ్యుడి మరో బొటనవ్రేలునీ
గురుదక్షిణిగా స్వీకరించాలి!
ఇప్పుడే బయలుదేరాలి
ధర్మాన్ని నాలుగు పాదాలేమిటి
నలువైపులా ప్రతిష్ఠించాలి!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
8 మార్చి 2020
(భారతీయ ధర్మాన్ని మించిన ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేదని వాదించే వారు, ఆ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే విమర్శిస్తున్నారనడాన్ని చూసి...)
ఇప్పుడే బయలు దేరాలి
నవ్య సులోచనాలు ధరించి
నవ్య భాష్యాల్ని చదవాలి
ఇప్పుడే బయలుదేరాలి
నవ్యపాదుకల్ని ధరించి
నవ్య మార్గాల్ని అన్వేషించాలి
ఇప్పుడే బయలుదేరాలి
శంబూకుడి శిరసు తెగిపడిన స్థలాన్ని
పవిత్రంగా ముద్దాడాలి!
ఇప్పుడే బయలుదేరాలి
ఏకలవ్యుడి మరో బొటనవ్రేలునీ
గురుదక్షిణిగా స్వీకరించాలి!
ఇప్పుడే బయలుదేరాలి
ధర్మాన్ని నాలుగు పాదాలేమిటి
నలువైపులా ప్రతిష్ఠించాలి!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
8 మార్చి 2020
(భారతీయ ధర్మాన్ని మించిన ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేదని వాదించే వారు, ఆ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లనే విమర్శిస్తున్నారనడాన్ని చూసి...)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి