(ఆంధ్రప్రభ దినపత్రిక, 16 మార్చి 2020 )
వాళ్ళు ఇల్లునలా
దున్నుతున్నంతసేపూ
హృదయ క్షేత్రంలో యేదో అలజడి!
అలసి సొలసినవాళ్ళులా విశ్రాంతి
తీసుకుంటున్నా
మదితపులెవరోమూసేసినంతవెలితి!
ఆడిపాడినపావురాల్లా వాళ్ళు ...
మరోప్రపంచంలోకెళ్ళిపోయి
నన్నింకో ప్రపంచంలోకి
తోసేస్తారు
కూనిరాగాల్లా వినపడుతూనో
నువ్వుమొలకల్లా కనిపిస్తూనో
రణరంగాన్నేదో తలపిస్తూనో
నన్నొక యేకాకి సమూహాన్నో
సమూహ యేకాకినో చేసేస్తుంటారు
వాళ్ళలా దున్నేసిన ఆ పొలంలో
వికసించే పూలపరిమళంలా
అమ్మతనానికున్నతన్మయత్వాన్నేమని వర్ణించాలి.
-దార్ల వెంకటేశ్వరరావు 1 నవంబరు 2018
మొబైల్: 9182685231
మా అబ్బాయి తో వాళ్ళమ్మ ఆ డుకుంటున్న సమయాన్ని తన్మయిాకరిస్తూ...
(ఆంధ్రప్రభ దినపత్రిక, 16 మార్చి 2020
సాహితీ గవాక్షంలో ప్రచురితం)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి