మహిళా ప్రాతినిథ్యంతోనే నిజమైన ఆర్థిక స్వావలంబన సాధ్యమౌతుందని
అడిషనల్ డెరైక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్ష్సస్ అండ్ నార్కోటిక్స్ వైశాలి మల్హోత్రా, ఐ.ఆర్.ఎస్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కాన్ఫరెన్స్ హాలులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, 'మహిళా సాధికారత' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు.
Mrs. Vaishali Malhotra, IRS ను జ్ఞాపికతో సత్కరిస్తున్న Incharge DSW Prof. Darla Venkateswara Rao, This Programe Coordinator, Deputy DSW Dr.G.Padmaja
Dr.Satya Lakshmi గార్ని జ్ఞాపికతో సత్కరిస్తున్న Incharge DSW Prof. Darla Venkateswara Rao, This Programe Coordinator, Deputy DSW Dr.G.Padmaja
Mrs Deepa Subramanyain గార్ని జ్ఞాపికతో సత్కరిస్తున్న Incharge DSW Prof. Darla Venkateswara Rao, This Programe Coordinator, Deputy DSW Dr.G.Padmaja
Mrs SriDevi Jast గార్ని జ్ఞాపికతో సత్కరిస్తున్న Incharge DSW Prof. Darla Venkateswara Rao, This Programe Coordinator, Deputy DSW Dr.G.Padmaja
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కాన్ఫరెన్స్ హాలులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, 'మహిళా సాధికారత' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్, డాక్టర్ జి.పద్మజ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో
మహా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఈవో దీపా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళలు కూడా పారిశ్రామిక రంగంలో ప్రవేశించి, తమ శక్తియుక్తులను ప్రదర్శించినపుడే మహిళల శక్తి ప్రపంచానికి తెలుస్తుందన్నారు.
హోలిస్టిక్ న్యూట్రిషనిష్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవి జాస్తి మాట్లాడుతూ మహిళలు తమ ఆలోచనలు, ఆత్మవిశ్వాసాలను బట్టి మాత్రమే నిర్ణయాలను తీసుకోవాలని అన్నారు. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే మంచి ఆలోచనలు వస్తాయన్నారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, మహిళలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
అనేక వివక్షలను అధికమిస్తూ అన్ని రంగాల్లోనూ ముందుకు రావడం హర్షణీయమని స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఆత్మవిశ్వాసంతోనే మహిళలు స్వయంశక్తిని ప్రదర్శించేందుకు తారని డిప్యూటీ చీఫ్ వార్డెన్ ఆచార్య డి.విజయలక్షి చెప్పారు.
పరిశోధకులు, విద్యార్థులు మహిళా సాధికారతపై జరిగిన చర్చలో పాల్గొని, వివిధాంశాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో దరహాసిని, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి