ఒక నైరాశ్యమేదో నన్ను చుట్టేస్తూ
కదలనీయనంటూ కట్టేస్తుంది
ఒక భయానక వాతావరణమేదో
నన్నుక్కిరిబిక్కిరి చేస్తూ చంపేస్తుంది
విన్నదాన్నే పదేపదే వినాలన్నా
చూసిందాన్నే పదేపదే చూడాలన్నా
సుదూర తీరాల్లోనైనా
ఒక్క సీతాకోకచిలుకో
ఒక్క మిణుగురు పురుగో
ఒక్క మెరుపుల ముఖమో
కనబడాలి కదా!
వాకిలి దాటని పాదాల్లా
పెదవి పలకని భావాలు
కోరుకున్న ఏకాంతం
జాబిల్లి ఒడిలో తన్మయత్వం!
సమూహం శాసించే ఏకాకితనం
సూర్యగోళం మీద పరిచిన అంపశయ్య!
ఎన్నాళ్ళీ బంగారు సంకెళ్లు?
ఎన్నాళ్ళీ రెక్కలు విరిచిన విహారయాత్రలు?
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 24.3.2020. 1.18
కదలనీయనంటూ కట్టేస్తుంది
ఒక భయానక వాతావరణమేదో
నన్నుక్కిరిబిక్కిరి చేస్తూ చంపేస్తుంది
విన్నదాన్నే పదేపదే వినాలన్నా
చూసిందాన్నే పదేపదే చూడాలన్నా
సుదూర తీరాల్లోనైనా
ఒక్క సీతాకోకచిలుకో
ఒక్క మిణుగురు పురుగో
ఒక్క మెరుపుల ముఖమో
కనబడాలి కదా!
వాకిలి దాటని పాదాల్లా
పెదవి పలకని భావాలు
కోరుకున్న ఏకాంతం
జాబిల్లి ఒడిలో తన్మయత్వం!
సమూహం శాసించే ఏకాకితనం
సూర్యగోళం మీద పరిచిన అంపశయ్య!
ఎన్నాళ్ళీ బంగారు సంకెళ్లు?
ఎన్నాళ్ళీ రెక్కలు విరిచిన విహారయాత్రలు?
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 24.3.2020. 1.18
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి