"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

22 మార్చి, 2020

'మహిమాన్వితులు'


వాళ్ళు ఒట్టిఅమాయకులేమో
దాన్ని వ్యాపారమని చెప్తూ
వచ్చిన ప్రతి ఉపద్రవాన్నీ
ఏదొక వస్తువుతో మాత్రమే
సొమ్ము  చేసుకుంటారు!
వీళ్ళేంట్రా బాబూ
తమదే విజ్ఞానమంటూ
నీటిమూటల మాహాత్మ్యాల్ని అమ్ముతుంటారు!
వీళ్ళు మహాజ్ఞానులు
వీళ్ళు మహా దార్శనికులు
వీళ్ళు మహా మహిమాన్వితులు
అందుకే
ఈ మహోపద్రవానికి మాయమైపోయారేమో
ఈ మహోపద్రవం తగ్గేవరకూ
ఏ మహాయజ్ఞంలో నిమగ్నమైపోయారో!!
వీళ్ళేంట్రా బాబూ
విశ్వంలో తొలిసారి విమానంలో
తామే విహరించామంటారు

వీళ్ళనేమనుకుంటన్నార్రా బాబూ
నాడు కుండల్నే టెస్టుట్యూబ్ బేబీ సెంటర్స్ చేయగలరు
మనుష్యులకు జంతువు తలలు
జంతువులకు మనిషి తలలు
చిలుకలు, ఎలుకలూ ...
రెల్లుగడ్డీ, ముళ్ళకంపలూ...
మత్స్యంలో, మంత్రంలో
పొదల్లో, పాదాల్లో,
మనుష్యుల్ని ఎక్కడనుండైనా
పుట్టించగల మహా జ్ఞానులు ర్రాబాబూ!
వాళ్ళు మనుష్యులు కాదురోయ్
మహా మహిమాన్వితుల్రా బాబూ
మహిమాన్వితులుకి మనతో పనేముంటుంది
వాళ్ళని ...
వాళ్ళ మానానికి వాళ్ళనే వదిలేద్దాంర్రా బాబూ!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 22.3.2020




కామెంట్‌లు లేవు: