అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించారు. స్టూడెంట్స్ వెల్ఫేర్, వసతి గృహాలు, స్పోర్ట్స్ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహిళా వాక్ ధాన్ ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ ఆచార్య అరుణ అగర్వాల్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటీ హాస్టల్ వార్డెన్ ఆచార్య డి.విజయలక్ష్మి, స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, ఈవెంట్ ఆర్గనైజర్స్ మరియు రీసెర్చ్ స్కాలర్స్ దరహాసిని బృందం సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. యూనివర్సిటీ క్యాంపస్ లో సుమారు 5 కిలోమీటర్ల వరకూ మహిళా విద్యార్థులు, పరిశోధకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
నమస్తే దినపత్రిక, 7 మార్చి 2020 సౌజన్యంతో....
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి