"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

30 November, 2019

మహోద్యమం!

ఎగిసిపడుతున్న కెరటాల్లా జనం
ఏ ఛానల్ చూసినా కళకళ్ళాడుతూ జనం
టీవీ స్టుడియోలో జనం
టీవీ తెరలముందు జనం
జనం ముందు మైకులు
మైకుల ముందు జనం
అసెంబ్లీలోజనం, పార్లమెంటులో జనం
పత్రికలనిండా వార్తలు!

ఎవరెవరో
ఏవేవో మాట్లాడుతున్నారు
ఎవరెవరిపక్షం మాట్లాడుతున్నారో
ఏవేవో మాట్లాడుతునే ఉన్నారు!
శవాలతో సెల్ఫీలు
బాధితులతో ఫోటోలు
బాగా రాకపోతే మరోసారి
ప్రత్యక్ష ప్రసారంలో బాగా రావాలి
పత్రికల్లో బాగా పడాలి!
ఎటుచూసినా జనం!
ఉద్యమం రగిలిపోతోంది
ఉద్యమం...
మహోద్యమమై కదిలిపోతోంది!
-దార్ల వెంకటేశ్వరరావు
30 నవంబరు 2019

No comments: