ఏహృదయమెప్పుడు
స్పందిస్తుందో
ఏ హృదయఘోషలు
ఎందుకు వార్తలవుతాయో
కదిలినట్లుండే కదలనితనం
కదలనట్లుండే కదకలిక తనం
అంతా ద్రవాధునికం!
ఆ...పేరు జపించలేదనీ...
నోట్లో ...పోసినప్పుడూ...
ఆ...కులం వాడితో కులకలేదనీ...
బట్టలూడదీసి ఊరేగించినప్పుడూ...
ఆ...కులంవాడ్ని ప్రేమించిందనీ...
వ్యభిచారిగా ముద్ర వేసినప్పుడూ....
వాడు గుర్రమెక్కివస్తున్నందుకూ...
మధమెక్కిందని నరికేసినప్పుడూ...
అదే అవమానం
అదే అత్యాచారం
అదే హత్యాచారం
జరుగుతున్నప్పుడు
ఈ హృదయమెందుకు స్పందించలేదబ్బా?
ఇంత సత్వర ''న్యాయం''
ఏమైయ్యిందబ్బా?
హృదయానిక్కూడా
మేధావితనమబ్బిందేమో!
ఏమో!!
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాద్, 9182685231
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి